"టైం వేస్టా ? ఏంటీ అహంకారం ?"- సీజేఐ కామెంట్స్ పై కాక్రోచ్ ల ఫైర్..!
ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్దులపై పోలీసుల దాడులపై అత్యవసర విచారణ జరపాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇవాళ తిరస్కరించింది. అయితే విద్యార్ధుల తరఫున ఈ పిటిషన్ పై వాదనలు వినిపిస్తున్న లాయర్ ఢిల్లీ పోలీసుల దాష్టికాల వీడియోలు చూడాలని కోరడంతో ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya kant) ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ టైమ్ వేస్ట్ చేయొద్దని, అలాగే మీ టైమ్ వేస్ట్ చేసుకోవద్దంటూ, అత్యవసర విచారణ వినతిని తోసిపుచ్చారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో ఇదే జస్టిస్ సూర్యకాంత్ చేసిన బొద్దింక వ్యాఖ్యల తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) ఆవిర్భావం జరిగింది. ఇవాళ తిరిగి విద్యార్ధుల పిటిషన్ విషయంలో సీజేఐ స్పందించిన తీరుపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ (Saurav Das) ఎక్స్ లో ఘాటుగా స్పందించారు. అంతటి ఉన్నత అధికార పదవులలో ఉన్న ఇలాంటి వ్యక్తులు మన ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ వంటివారు అంటూ సీజేఐని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

Such people in positions of so much power are a blot on our democracy. Our Supreme Court deserves better. Surya Kant ji must realise that so much arrogance is not good. Government of India must counsel him. https://t.co/APlRoPPzpN
— Saurav Das (@SauravDassss) July 22, 2026
మన సుప్రీంకోర్టుకు మరింత గౌరవం అవసరమని సౌరవ్ దాస్ తెలిపారు. ఇంతటి అహంకారం మంచిది కాదని సూర్యకాంత్ గారు గ్రహించాలని కూడా కోరారు. అలాగే భారత ప్రభుత్వం ఆయనకు తగిన సూచనలు చేయాలని సౌరవ్ దాస్ తన ట్వీట్ లో సూచించారు. దీంతో మరోసారి సుప్రీంకోర్టుకూ, బొద్దింకల పార్టీకీ మధ్య పరిస్ధితి వేడెక్కింది. మరోవైపు విద్యార్థులపై దాడుల వీడియోలు చూసేందుకు టైం లేదంటూ సీజేఐ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యల్ని పలువురు తప్పుబడుతున్నారు. ఇంకొందరు మాత్రం సుప్రీంకోర్టులో ఇప్పటికీ కీలక కేసులు పెండింగ్ లో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు.












Click it and Unblock the Notifications