తెలంగాణ ఎఫెక్టా: బిజెపి వైపు జగన్, బాబు షాక్

 Narendra Modi, Chandrababu Naidu cozy up
నాలుగు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించి 2014 ఎన్నికల ఉత్సాహంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా చూస్తున్నారు. అందుకు తెలంగాణ అంశమే కారణమని తెలంగాణ ప్రాంత నేతలు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు, వైయస్ జగన్‌లు రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకే బిజెపి వైపు అడుగులు వేస్తున్నారని అనుమానిస్తున్నారు. పార్లమెంటుకు తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు దానిని అడ్డుకుంటే తాము కలుస్తామని వారు సంకేతాలు పంపిస్తున్నట్లుగా కనిపిస్తోందని టి కాంగ్రెసు నేతలు అంటున్నారు. అయితే వారి ఆశలు నెరవేరవని, అది సాధ్యం కాదంటున్నారు.

మరోవైపు బిజెపి వైపు చూస్తున్న జగన్‌కు చంద్రబాబు ముందే షాకిచ్చినట్లుగా కనిపిస్తోంది. ఓ ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఎవ్వరూ అంటరానివారు కాదని, నరేంద్ర మోడీతో సహా తమ ఆకాంక్షలు, డిమాండ్లను ఆమోదించే వారెవరితోనైనా చేతులు కలుపుతామని ప్రకటించారు. తాము విభజనకు వ్యతిరేకమని, విభజనను సమర్థించే పార్టీలతో పొత్తు పెట్టుకోమని చెప్పారు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తుడిచి పెట్టుకు పోవడంతో జగన్ క్రమంగా బిజెపి వైపుకు మరలుతున్నారంటున్నారు.

అయితే, జగన్ బిజెపికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుండగానే చంద్రబాబు ఆ పార్టీకి సంకేతాలిచ్చారు. శనివారం భోపాల్‌లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనడమే కాకుండా బిజెపి అగ్రనేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. హైదరాబాదుకు వచ్చిన చంద్రబాబు బిజెపితో కలిసినట్లేనని సంకేతాలు కూడా ఇచ్చారట. తద్వారా జగన్‌కు బాబు షాక్ ఇచ్చారంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+