సందిట్లో సడేమియా: అసెంబ్లీలో మళ్లీ పాము
హైదరాబాద్: విభజన రాజకీయాలతో రాష్ట్ర శాసనసభ అట్టుడికిపోతుంటే సందిట్లో సడేమియా మాదిరిగా పాములు కలకలం సృష్టిస్తున్నాయి. మరోసారి పాము శాసనసభ ఆవరణలో కనిపించి, భయాందోళనలకు గురి చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో భాగంగా మీడియా పాయింట్‌కు సమీపంలో రెండు రోజుల క్రితం మరో పాము దర్శనమిచ్చింది.
పామును గమనించి పలువురు ఎమ్మెల్యేలు, పాత్రికేయులు హడావుడి చేసే సరికి అది బండరాళ్ల కిందకు వెళ్లి దాదాపు గంట వరకు కన్పించకుండా పోయింది. అది మామూలు పామే అనే విషయం తెలియటంతో కలకలం సద్దుమణిగింది. చివరకు శాసనసభ సిబ్బంది జోక్యం చేసుకుని పాములు పట్టే వ్యక్తిని తీసుకుని రావటంతో ఆయన క్షణంలో పామును చేతితో పట్టుకుని సంచిలో వేసుకుని వెళ్లిపోయాడు.

శాసనసభా సమావేశాలకు ముందు శాసనసభ ఆవరణలో దర్శనమిచ్చింది. పామును వీడియో తీసేందుకు జర్నలిస్టులు హడావుడి చేయడంతో అదికాస్తా టిజిఎల్పీ కార్యాలయంలోకి చొరబడింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది పాములు పట్టేవారిని తీసుకొచ్చి వెదికించినా, అది దొరకలేదు.
శాసనసభ ఆవరణలో అప్పుడు రెండు పాములు కనిపించాయి. పాములను పట్టుకునే వ్యక్తి వెతికితే ఓ పాము మాత్రం చిక్కింది.












Click it and Unblock the Notifications