వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్వేపైకి దూసుకెళ్లిన శివప్రసాద్: చిద్దూపై చిందులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sivaprasad
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల్లో ఒకానొక సందర్భంగా తెలుగుదేశం చిత్తూరు పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ వైపు ఆగ్రహంతో దూసుకెళ్లారు. ఎవరి అభిప్రాయాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా తెలంగాణ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని శివప్రసాద్ డిమాండ్ చేశారు.

ఈ సమయంలో ఆయనకు, సర్వే సత్యనారాయణకు మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ సమయంలో శివప్రసాద్ ఆగ్రహంతో ఊగిపోతూ సర్వే వైపు దూసుకెళ్లారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కనుమూరి బాపిరాజు, హర్షకుమార్ శివప్రసాద్‌ను నిలువరించారు.

కేంద్రమంత్రి చిదంబరంపై శివప్రసాద్ చిందులేశారు. సోమవారం ఉదయం పార్లమెంటు సమావేశం ఆరంభం కాగానే రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని చిత్తూరు ఎంపి శివప్రసాద్‌ తప్పుబట్టారు. ఆర్థిక మంత్రి చిదంబరాన్ని ఉద్దేశించి ఈ చిచ్చుకు కారణం మీరేనంటూ మండిపడ్డారు. అర్థరాత్రి అనాలోచిత ప్రకటనలతో రాష్ట్రాన్ని ముక్కలు చేసే పరిస్థితి తీసుకువచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చివరకు స్పీకర్‌ మీరా కుమార్ శివప్రసాద్‌ను ప్రశ్నించడంతో తాము తమ నియోజకవర్గాలలో తిరగలేని పరిస్థితి ఉందని ఆమెకు వివరించారు. అక్కడ ఎలాంటి నిరసనలు వ్యక్తమవుతున్నాయో తెలుసుకోవాలని కోరారు. అందుకు అనుగుణంగా నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
The Telugudesam Telangana MP Sivaprasad has clashed with union minister from Telangana Sarvey Satyanarayana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X