జిమ్ బిజినెస్‌లో రామ్ చరణ్ తేజ భార్య ఉపాసన

లాటిట్యూడ్ జిమ్ నిర్వాహకులతో ఆమె ఇటీవల ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇకపై లాటిట్యూడ్ జిమ్‌ల పేర్లు అపోలో వెల్‌నెస్ సెంటర్లుగా మారనున్నాయి. వీటి నిర్వహణ ఉపాసన ఆధ్వర్యంలో కొనసాగుతుంది.
ప్రస్తుతం హైదరాబాదు నగరంలో మాత్రమే ఉన్న తమ జిమ్ సెంటర్లను త్వరలో ముంబై, చెన్నై, వైజాగ్‌లకు విస్తరించినున్నట్లు ఉపాసన చెప్పారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న టెక్నాలజీని ఈ జిమ్‌లలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది.
మహిళలు నాజుగ్గా తయారు కావడానికి బాడీ ఫిట్‌నెస్‌గా ఉండడానికి జిమ్‌లు ఉపయోగపడతాయని ఆమె చెబుతున్నారు. ఏమైనా, ఆమె ఈ రంగంలో ఓ వెలుగు వెలిగే అవకాశం లేకపోలేదు.












Click it and Unblock the Notifications