వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'అమ్మ' పాటకు చలించిన విజయమ్మ, కంటతడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ గురువారం రాత్రి కంటతడి పెట్టారు. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద విజయమ్మ నిన్న ఉదయం ఫీజు పోరు దీక్ష ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం అది ముగుస్తోంది. రెండు రోజుల దీక్షలో భాగంగా నిన్న రాత్రి హైదరాబాదుకు చెందిన ములకలపల్లి రవి అనే కళాకారుడు అమ్మ పైన ఓ పాట పాడారు.

ఆయన పాటకు విజయమ్మ చలించి, ఓ దశలో కంటతడి పెట్టారు. 'అమ్మంటే నీలా ఉండాలని ఆంధ్రదేశం అనుకుంటుందమ్మా..' అంటూ రవి దీక్షా శిబిరం వేదిక పైన పాడారు. ఈ పాట ఆసక్తిగా విన్న విజయమ్మ చలించిపోయారు. విజయమ్మనే కాకుండా దీక్షా శిబిరంలో ఉన్న వారు సైతం చలించిపోయారు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వచ్చి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత జగన్ పలు కేసుల్లో చిక్కుకొని జైలుకు వెళ్లారు. ఆయన జైలుకు వెళ్లే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఓదార్పు యాత్ర చేపట్టారు. సీమాంధ్రలో టిడిపి, కాంగ్రెసు పార్టీకి ముచ్చెమటలు పోయించారు. ఆయన జైలుకు వెళ్లాక పార్టీని నడిపించే వారు లేకుండా పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయమ్మ, జగన్ సోదరి షర్మిల పార్టీలో ఉత్సాహం నింపి, ఉప ఎన్నికలలో గెలిపించిన బాధ్యతను తీసుకున్నారు.

జగన్ లేని లోటును విజయమ్మ, షర్మిలలు తీరుస్తున్నారే చెప్పవచ్చు. జగన్ ఉన్నంత ఉత్సాహం పార్టీలో లేకపోయినప్పటికీ, కార్యకర్తలకు మాత్రం తల్లీకూతుళ్లు భరోసా ఇస్తున్నారు. జగన్ ఏడాదికి పైగా జైలు గోడల మధ్యే ఉన్నారు. విజయమ్మ గౌరవాధ్యక్షురాలిగా, షర్మిల ఇప్పటి వరకు ఎలాంటి పదవి లేకుండా పార్టీ కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారు. అక్టోబర్‌లో జగన్‌కు బెయిల్ వస్తుందని అందరూ భావిస్తున్నారు. అనుకోని పరిస్థితులు ఎదురైనా తల్లీకూతుళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రవి 'అమ్మంటే నీలా ఉండాలని' పాట పాడటంతో విజయమ్మ చలించిపోయి, కంటతడి పెట్టారు.

English summary
YSR Congress honorary president YS Vijayamma began her two day hunger strike on Thursday at Indira Park. She was wept on Thursday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X