బీజేపీ అభ్యర్థికి 2,000 మంది కూతుర్ల ప్రచారం!

ముంబై: మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున షోలాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న సుభాష్ దేశ్‌ముఖ్ తరఫున రెండువేల మంది కూతుళ్లు, మరో రెండువేల మంది అల్లుళ్లు ప్రచారం చేస్తున్నారు! సుభాష్ గతంలో పార్లమెంటు సభ్యుడిగా పని చేశారు. అయితే, ఈసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు.

సుభాష్ దేశ్‌ముఖ్ గత ఏడేళ్లుగా పేద కుటుంబాలను ఆదుకోవడం కోసం ఏటా సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. పెళ్లిళ్లు చేయడంతో పాటు నవ దంపతుల కాపురానికి అవసరమైన సామాగ్రిని కూడా అతడే అందిస్తున్నారు. అంతేకాకుండా వారికి ఆడపిల్ల పుడితే ఆమె పేరున రూ.5 వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారు.

4,000 daughters, sons in law campaign for BJP candidate

ఇలా ఆయన రెండువేల మంది యువతులకు వివాహం జరిపించారు. ఆ యువతులు సుభాష్ దేశ్‌ముఖ్‌ను పితృసమానుడిగా చూస్తుంటారు. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఆ యువతులు, వారి భర్తలు సుభాష్ తరఫున ప్రచారం చేస్తున్నారు.

ఎందరో రైతులు, పేదవారు.. తమ కూతుళ్లకు పెళ్లిళ్లు చేసేందుకు భూమి అమ్ముకోవడం చూసి తాను.. అలాంటి వారిని ఆదుకునేందుకే పెళ్లి చేశానని, ఇప్పుడు వారు అంతా తనకు మద్దతుగా ప్రచారం చేయడం సంతోషంగా ఉందని సుభాష్ దేశ్‌ముఖ్ చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+