మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓటేసి కారు గెలిచిన మహిళ: మరికొందరూ..

|
Google Oneindia TeluguNews

A woman wins Nano for voting
మెదక్: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శాతం పెంచేందుకు రాష్ట్రంలో తొలిసారిగా మెదక్ జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఓటరు పండగలో భాగంగా పలువురు ఓటర్లు వివిధ బహుమతులు గెలుచుకున్నారు. ఈ ఓటరు పండగలో భాగంగా ఓ మహిళ ఓటేసి కారు గెలుచుకున్నారు. మెదక్ కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఓటరుపండగకు జిల్లాలో మంచి స్పందన వచ్చింది.

100శాతం ఓట్లు నమోదైన గ్రామాల్లోని ఓటర్ల నుంచి లక్కీ డ్రా తీసి బహుమతులు అందజేస్తామన్న ప్రచారంతో జిల్లాలో గణనీయంగా 76.84 శాతం పోలింగ్ నమోదైంది. ఏప్రిల్ 30న ఎన్నికల్లో 95శాతం పోలింగ్ నమోదైన గ్రామాలకు కలెక్టరేట్‌లో గురువారం డ్రా తీశారు. సిద్దపేట నియోజకవర్గంలోని 145వ పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేసిన పరుస లచ్చవ్వకు నానోకారు గెలుచుకున్నారు.

నర్సాపూర్ నియోజకవర్గంలోని పల్పానూర్‌కి చెందిన పిట్ల శ్రవణ్‌కు ద్వితీయ బహుమతిగా హీరో హోండా బైక్, శివంపేట మండలం పరికి బండ్లకి చెందిన చుక్కా నారాయణ మూడో బహుమతిగా ఎల్ఈడి టీవీ గెలుచుకున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని గిరిపల్లి ఓటరు పోసాని నరేష్ వ్యవసాయ పంపుసెట్, పటాన్‌చెరు నియోజకవర్గం పుట్టుగూడకి చెందిన పి శ్రీనివాస్ యాదవ్ 220 లీటర్ల కెపాసిటీ గల రిఫ్రీజిరేటర్ గెలుచుకున్నారు.

92శాతం పోలింగ్ సాధించిన గ్రామాల్లో ఓటర్లకు 220 సెల్‌ఫోన్లు, 410 మంది ఓటర్లకు గృహోపకరణాలు, 460 సీలింగ్ ఫ్యాన్లు, 60 హాట్ బాక్సులు, 20 మందికి ఓటర్లకు బ్రీఫ్‌కేస్‌లను మే 17న కలెక్టరేట్‌లో కలెక్టర్ స్మితా సబర్వాల్ అందజేయనున్నారు. 92శాతం పోలింగ్ దాటిని గ్రామాలకు రూ. 2లక్షల అభివృద్ధి ప్యాకేజీని కలెక్టర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

English summary
Winners in the elections will have to wait until the results are out on Thursday but in Medak district of Telangana region, voters are celebrating like never before.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X