చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీ సీఎం కార్యాలయ అధికారి స్మితా సబర్వాల్‌కు ఏపీ కోర్టు సమన్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పని చేస్తున్న స్మితా సభర్వాల్ పైన గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మదనపల్లె ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ప్రదీప్ కుమార్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేశారు.

2003లో స్మితదాస్ మదనపల్లె సబ్ కలెక్టర్‌గా పని చేశారు. అప్పట్లో కొండామర్రిపల్లె సమీపంలో గాయిత్రీస్టోన్ క్రషర్స్‌లో 39 మంది కూలీలకు తక్కువ జీతం ఇస్తూ వారితో వెట్టిచాకిరీ చేయిస్తుండడంతో గుర్తించిన స్మితదాస్ యజమాన్యం క్రిష్ణమూర్తి, శ్రీనివాసులుపై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో వుంది.

Bailable warrant to Smita Sabharwal

కాగా 2009 నుంచి స్మితదాస్ కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో మదనపల్లె ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేశారు. ఈ నెల 15లోగా ఆమె కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

స్మితాదాస్ 2003 నుంచి 2009 వరకు మదనపల్లె కోర్టుకు హాజరైన స్మితాదాస్‌, ఆ తరువాత నాలుగేళ్లుగా కోర్టుకు హాజరుకాలేదు. దీంతో ఈనెల 15వ తేదీ లోపు తప్పకుండా కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆమెకు బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

English summary
Bailable warrant to Smita Sabharwal from Andhra Pradesh's Madanapalli court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X