కర్నూలు రాజధాని ఇష్యూ: తేల్చేసిన చంద్రబాబు

కర్నూలు: కర్నూలును ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయాలని వస్తున్న డిమాండ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరోక్షంగా కొట్టిపారేశారు. ఆయన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రసంగంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉండబోతుందో చెప్పకనే చెప్పారు. అదే సమయంలో కర్నూలు అభివృద్ధికి తాను చేపట్టే కార్యక్రమాలపై కాస్తా సుదీర్ఘంగానే వివరించారు.

రాయలసీమ చెన్నై, హైదరాబాద్, బెంగళూర్, రాబోయే ఎపి రాజధానికి అనుసంధానం చేసే విధంగా ఉంటుందని, అందుకని రాయలసీమలో రోడ్లను అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. దీన్నిబట్టి కర్నూలులో రాజధాని రాదని ఆయన స్పష్టం చేశారు.

Chandrababu clears on Andhra Pradesh capital

ఆలాగే, కర్నూలును స్మార్ట్ సిటీగా రూపొందిస్తామని హామీ ఇచ్చారు. విండ్ మిల్స్‌ను కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. రహదారులను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రకంగా కర్నూలు రాజధానిని చేయాలనే డిమాండ్‌పై ఆందోళనలు చెలరేగకుండా జాగ్రత్త పడినట్లు చంద్రబాబు కనిపిస్తున్నారు.

అయితే, చంద్రబాబు కర్నూలును అవమానపరిచే విధంగా తన ప్రసంగంలో వ్యాఖ్యానించారనే మాట వినిపిస్తోంది. ఇన్నాళ్లు హైదరాబాదులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకున్నామని, ఇప్పుడు కర్నూలులో నిర్వహించుకోవడం ఆవేదనగా ఉందని చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు ఆంధ్ర రాజధానిగా ఉన్న కర్నూలును చంద్రబాబు ఆ విధంగా ఆవమనించారని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+