లోకేష్ చేస్తే తప్పేంటి: బాబు హావభావాలు(పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పార్టీ కోసం పని చేస్తే తప్పేమిటి? అని ఆ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం వ్యాఖ్యానించారు. అందరి కుటుంబ సభ్యులూ వివిధ పార్టీల్లో పని చేస్తున్నారని, లోకేష్ పార్టీ కోసం పని చేస్తే తప్పేమిటి అని ఆయన నిలదీశారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను లోకేష్‌కు అప్పగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయని విలేకరులు ప్రశ్నించారు.
దీంతో చంద్రబాబు నాయుడు పై విధంగా స్పందించారు. గురువారం రాత్రి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసి తీరుతామన్నారు. పరోక్షంగా టిఆర్‌ఎస్ తెలంగాణకు మాత్రమే పరిమితమని చెబుతూ తెలుగుదేశం పార్టీ మూడు పాత్రలను పోషిస్తోందని, ఆంధ్రా ప్రాంతంలో అధికారంలో ఉండగా, తెలంగాణ ప్రాంతంలో ప్రతిపక్షంలో ఉందని, కేంద్రంలో ఢిల్లీలో కూడా తాము బలపరిచిన ప్రభుత్వమే అధికారంలో ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
విజయవాడ-గుంటూరు- తెనాలి-మంగళగిరి ఉడా ప్రాంతంలోనే రాజధాని వస్తుందని, ఈ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేసే యోచన ఉన్నట్లు చంద్రబాబు సూత్రప్రాయంగా చెప్పారు. ఒక రోజు గుంటూరు జిల్లా, మరో రోజు విజయవాడ వద్ద రాజధాని అంటున్నారని, రాజధాని ఎక్కడ వస్తుందని అడిగితే, రాజధాని ఏర్పాటు చేసే ప్రాంతం కొత్త జిల్లా అవుతుందని ఆయన బదులిచ్చారు.

చంద్రబాబు
విభజన సరిగా జరగలేదని, ఇలా విభజన చేస్తే ఇబ్బందులు వస్తాయని తాను పలుమార్లు హెచ్చరించానని ఏపీ సీఎం చంద్రబాబు గురువారం అన్నారు.
ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెరాస, తెలంగాణ సీఎం కేసీఆర్ పైన నిప్పులు చెరిగారు.

చంద్రబాబు
విద్యుత్ సమస్యలు తలెత్తుతాయని ముందే చెప్పానని అన్నారు. అయితే, తెరాస నేతలు మాత్రం వాటిని పట్టించుకోకుండా తాము ఉత్పత్తి చేసుకుంటామని చెప్పారని చెప్పారు.

చంద్రబాబు
తెలంగాణలో కరెంట్ వినియోగం ఎక్కువగా ఉంటుందని, సమస్యలు వస్తాయని అప్పుడే చెప్పానన్నారు. విద్యుత్ సెక్టారులో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత తమదే అన్నారు.

చంద్రబాబు
రాష్ట్ర విభజన హేతుబద్దంగా జరగలేదన్నారు. సరైన పరిష్కారాలు చూపకుండా విభజన చేయడం వల్లనే సమస్యలు వస్తున్నాయన్నారు.

చంద్రబాబు
ప్రజలను ఒప్పించకుండానే విభజన చేశారని ఆనాడే చెప్పామన్నారు. తెలంగాణలోని కరెంట్ కష్టాలకు తాను ఎలా కారణం అవుతానని ప్రశ్నించారు.

చంద్రబాబు
తెలంగాణ సీఎం కేసీఆర్ నా పైన లేనిపోని అభాండాలు వేస్తున్నారన్నారు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఉన్న అభివృద్ధి తమ హయాంలో జరిగిందే అన్నారు. కరెంట్ సమస్యలు వస్తాయని ముందే చెబితే.. తాము చత్తీస్‌గఢ్ నుండి తీసుకు వస్తామని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు.

చంద్రబాబు
కేసీఆర్ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టారన్నారు. ఏపీలో విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు తాము 700 మెగావాట్ల విద్యుత్ కొన్నామని, కేంద్రంతో మాట్లాడి మరో రెండువందల మెగావాట్లు తెచ్చుకున్నామన్నారు.

చంద్రబాబు
కేసీఆర్ మాత్రం ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిలో టీడీపీది కీలక పాత్ర అని చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications