ఎయిర్‌పోర్టులో బాంబు జోక్... భారీ జరిమానా కట్టిన డాక్టర్
న్యూఢిల్లీ: అమెరికాలో వెనిజులాకు చెందిన ఓ డాక్టర్ బాంబు జోక్ పేల్చి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. వివరాల్లోకి వెళితే మాన్యుయేల్ అల్వరాడో (60) అనే డాక్టర్ అక్టోబర్ 22న బొగోటా వెళ్లేందుకు మియామి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు.
ఏవియాంకా ఎయిర్ లైన్స్ ఫ్లైట్ ఎక్కేముందు సెక్యూరిటీ చెకప్ కోసం లైన్లో నిలుచున్నాడు. సెక్యూరిటీ అధికారి రొటీన్ ప్రశ్నలే అడిగాడు. ఎక్కడికెళుతున్నారు? లగేజిలో ఏముంది? అంటూ ప్రశ్నించాడు. దీనికి బదులుగా తన లగేజిలో పేలుడు పదార్థాలు (సీ-4) తీసుకెళుతున్నానంటూ జవాబిచ్చాడు.

దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన భద్రతా అధికారి వేగంగా స్పందంచి.. సిబ్బందిని అప్రమత్తం చేశాడు. వెంటనే ప్రయాణికులను అక్కడి నుంచి దూరంగా పంపేసి, తనిఖీలు మొదలుపెట్టారు. ఇంతలో ఆ డాక్టర్ తాను జోక్ చేశానని ఎంత చెప్పినా వినకుండా అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారని డాక్టర్ తరపు న్యాయవాది బ్రియాన్ బైబర్ తెలిపారు.
దీంతో రూ. 55 లక్షల జరిమానా కడితే బాంబు బెదిరింపు తదితర ఆరోపణలను వెనక్కి తీసుకునేందుకు ప్రాసిక్యూటర్లు అంగీకరించారు. చేసేది ఏమీ లేక జరిమానా కట్టి ఇంటికి చేరుకున్నాడు. సెప్టెంబర్ 11, 2001 తర్వాత అమెరికాలో బాంబు బెదిరింపు విషయాలను చాలా సీరియస్‌గా తీసుకోవడమే కాకుండా జరిమానాని కూడా విపరీతంగా పెంచారు.












Click it and Unblock the Notifications