ఉస్మానియా తీరు: ఒకరి శవాన్ని మరొకరికి, సమాధి
హైదరాబాద్: విషాదంలోనూ ఉస్మానియా జనరల్ ఆస్పత్రి మార్చురీ అధికారులు, పోలీసులు వినోదం ప్రదర్శించారు. ఓ శవం అప్పగింత విషయంలో వారిపై ఆరోపణలు వచ్చాయి. 55 ఏళ్ల రిటైర్డ్ ఆర్టీసి డ్రైవర్ మృతదేహాన్ని మరో కుటుంబానికి అప్పగించారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఆ శవాన్ని పొందిన కుటుంబ సభ్యులు దానికి అంత్యక్రియలు చేసి, సమాధి చేశారు కూడా. దాంతో ఆ శవాన్ని వెలికి తీసి, పోలీసులు డిఎన్ఎ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. హైదరాబాదులోని అంబర్‌పేటకు చెందిన ఎండి రఫీక్ పది రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి అదృశ్యమయ్యాడు. దాంతో ఆ విషయంపై కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డిసెంబర్ 4వ తేదీన అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఓ శవం కనపించింది. ఆ శవాన్ని మార్చురీకి తరలించారు. అతని ఫొటోలను గుర్తు తెలియని వ్యక్తిగా పోలీసులు స్టేషన్‌లో పెట్టారు. ఇంతలో కిషన్‌బాగ్‌కు చెందిన 70 ఏళ్ల మొహ్మద్ సలీం నెలన్నర రోజులుగా కనిపించడం లేదని అతని కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుర్తు తెలియని శవం గురించి సలీం కుమారుడు సయ్యద్ అర్షద్ తెలుసుకుని డిసెంబర్ 7వ తేదీన పోలీసు స్టేషన్‌కు వచ్చాడు. ఫొటోగ్రాఫ్‌ను, పత్రాలను సమర్పించి, ఆ శవాన్ని తీసుకుని వెళ్లారు. మొత్తం మీద, ఆ శవం వివాదాన్ని తేల్చడానికి పోలీసులు తీవ్రంగానే కష్టపడాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications