వివాదం తెచ్చుకోం: వెంకయ్యతో కేటీఆర్ (పిక్చర్స్)

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం ఢిల్లీలో బిజీగా గడిపారు. సిద్ధాంతాల విషయంలో విభేదించినప్పటికీ రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో మెలుగుతామని, వివాదాలు కొని తెచ్చుకునే ఆలోచన లేదని ఈ సందర్భంగా కేటీఆర్‌ అన్నారు.

కేంద్ర చేనేత శాఖ మంత్రి సంతోష్ కుమార్‌ గంగ్వార్‌ బుధవారం నిర్వహించిన రాష్ట్రాల చేనేత మంత్రుల సమావేశానికి కేటీఆర్‌ హాజరయ్యారు. అనంతరం ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

బాపట్లలోని మెగా హ్యాండ్లూమ్‌ క్లస్టర్‌ తరహాలో మెదక్‌ జిల్లాలో ఒకటి ఏర్పాటు చేయాలని, కరీంనగర్‌, నల్గొండ జిల్లాల్లో 11 హ్యాండ్లూమ్‌ క్లస్టర్లను, మహబూబ్‌నగర్‌ జిల్లాలో హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ పార్క్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు. హైదరాబాదుకు పరిశ్రమలు వరుస కడతాయన్నారు.

వెంకయ్యతో కేటీఆర్

వెంకయ్యతో కేటీఆర్

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు పుష్పగుచ్ఛం ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. పక్కనే ఎంపీ బాల్క సుమన్. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యను కలిసి జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలో నిజామాబాద్‌, రామగుండం, ఖమ్మం నగరాలను చేర్చాలని ఇప్పటికే పంపిన ప్రతిపాదనలను ఆమోదించాలని కోరానన్నారు. తద్వారా ఆయా నగరాల్లో సిటీ బస్సులు నడిపేందుకు అవకాశం లభిస్తుందన్నారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలో సిరిసిల్ల మున్సిపాలిటీని చేర్చాలని కోరినట్లు చెప్పారు.

సంతోష్ గాంగ్వార్‌తో కేటీఆర్

సంతోష్ గాంగ్వార్‌తో కేటీఆర్

కేంద్రమంత్రి సంతోష్ గాంగ్వార్‌తో పుష్పగుచ్ఛం ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. రాష్ట్రాల చేనేత మంత్రుల సమావేశానికి కేటీఆర్‌ హాజరయ్యారు.

సంతోష్ గాంగ్వార్‌తో కేటీఆర్

సంతోష్ గాంగ్వార్‌తో కేటీఆర్


సిరిసిల్లలో మరమగ్గాల అభివృద్ధికి మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని, వరంగల్‌లోని అజంజాహీ స్పిన్నింగ్‌ మిల్లును పునరుద్ధరించాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాల భూమిని ఉచితంగా ఇస్తుందని కేటీఆర్ తెలిపారు. తమకు సహకరించాలని కేంద్రమంత్రిని కోరారు.

రవిశంకర ప్రసాద్‌తో కేటీఆర్

రవిశంకర ప్రసాద్‌తో కేటీఆర్

కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌నూ కలిశానని, ఉమ్మడి హైకోర్టును విభజించి రెండు రాష్ట్రాల హైకోర్టులనూ ఒకే ఆవరణలో ఏర్పాటు చేయాలని కోరానని తెలిపారు. ఐటీఐఆర్‌ మొదటి దశ అమలుకు కేంద్రం రూ.165 కోట్లు కేటాయించిందని, మరో రూ.942 కోట్లు మంజూరు చేయాలని కోరానన్నారు. రెండో దశ కోసం మరో రూ.3110 కోట్లు కేటాయించాలని కూడా కోరినట్లు తెలిపారు. తెలంగాణలో నైపుణ్యాభివృద్ధి కోసం రూ.200 కోట్లు కేటాయించాలని కోరానన్నారు.

సంతోష్ గాంగ్వార్‌తో కేటీఆర్

సంతోష్ గాంగ్వార్‌తో కేటీఆర్

కేంద్రమంత్రి సంతోష్ గాంగ్వార్‌తో పుష్పగుచ్ఛం ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. రాష్ట్రాల చేనేత మంత్రుల సమావేశానికి కేటీఆర్‌ హాజరయ్యారు.

సంతోష్ గాంగ్వార్‌తో కేటీఆర్

సంతోష్ గాంగ్వార్‌తో కేటీఆర్

కేంద్రమంత్రి సంతోష్ గాంగ్వార్‌తో పుష్పగుచ్ఛం ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. రాష్ట్రాల చేనేత మంత్రుల సమావేశానికి కేటీఆర్‌ హాజరయ్యారు.

సంతోష్ గాంగ్వార్‌తో కేటీఆర్

సంతోష్ గాంగ్వార్‌తో కేటీఆర్

కేంద్రమంత్రి సంతోష్ గాంగ్వార్‌తో పుష్పగుచ్ఛం ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. రాష్ట్రాల చేనేత మంత్రుల సమావేశానికి కేటీఆర్‌ హాజరయ్యారు. కాగా, కేంద్ర కార్మిక శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ను కలిశానని, ఏడు జిల్లాల్లోని బీడీ కార్మికులందరికీ ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందించాలని కోరినట్లు కేటీఆర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+