హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్త్రీల బ్రాలు, లోదుస్తుల్లో బంగారు నగలు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అనుమతి లేకుండా తీసుకెళుతున్న బంగారాన్ని సోమవారం హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు. ఇదే విమానాశ్రయంలో ఆదివారంనాడు ఏడు లక్షల రూపాయల విలువచేసే బంగారం పట్టుబడింది.

స్త్రీలు ధరించే బ్రాలు, లోదుస్తుల్లో బంగారాన్ని తీగల్లా మలిచి అధికారుల కళ్లు కప్పి తీసుకెళ్ళేందుకు యత్నించిన ఇద్దరు నిందితులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు. వీరి వద్ద 932 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ దాదాపు 28,14, 640 లక్షలు ఉంటుందని అధికారులు అంచనావేశారు.

దుబాయ్ నుంచి సోమవారం శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు ప్రయాణికులపై అనుమానంతో కస్టమ్స్ అధికారులు వారి సూట్‌కేసులు తనిఖీ చేశారు. అందులో స్త్రీలు వేసుకొనే కొన్ని లోదుస్తులు ఉన్నాయి. వాటి నడుమ తీగల మాదిరిగా అమర్చిన బంగారం కనిపించింది.

 Gold

కేరళకు చెందిన ఎండీ.ఇక్బాల్, హైదరాబాద్‌కు చెందిన షేక్ జలీల్‌ను అదుపులోకి తీసుకున్నామని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

English summary
Customs official arrested men who are transporting gold illegally at Shamshabad Rajiv Gandhi international airport near Hyderebad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X