టీ రూ.410 కోట్లు మళ్లింపు, ఫైళ్లు మాయం(పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖలో రూ.410 కోట్ల నిధులు గోల్‌మాల్ అయ్యాయంటూ శాఖ కమిషనర్ అశోక్ పోలీసులను ఆశ్రయించారు. ఈ నిధులను ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఖాతాకు అక్రమంగా మళ్లించారని గురువారం ఆయన హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కేసు దర్యాప్తు ప్రారంభించిన చిక్కడపల్లి పోలీసులు కార్మిక శాఖ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ నెల 7న నిధులు దారి మళ్లినట్టు గుర్తించారు.

తరలింపుతో సంబంధం ఉన్న ఎపిబిఓసిడబ్ల్యూడబ్ల్యూ అధికారులు రామారావు, మురళీ సాగర్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే నిధుల మళ్లించినట్టు వారు చెప్పారు. నిధుల మళ్లింపులో అక్రమాలేమి జరగలేదని స్పష్టం చేశారు.

కార్మిక నిధి

కార్మిక నిధి

ఉమ్మడి రాష్ట్రంలో భవన నిర్మాణ కారమికుల సంక్షేమ నిధి నుండి రూ.410 కోట్లు అక్రమంగా మళ్లించారన్న అభియోగాల పైన ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ కార్యదర్శి, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం అదనపు కమినర్ మురళీ సాగర్, ఫైనాన్స్ మేనేజర్ రామారావుల పైన పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.

కార్మిక నిధి

కార్మిక నిధి

హెచ్ఎంఎస్ (హిందూస్తాన్ మజ్దూర్ సంఘ్) కార్మిక సంఘం ప్రతినిధుల ఫిర్యాదు మేరకు వీరిద్దరి పైన చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

కార్మిక నిధి

కార్మిక నిధి


దీనికి సంబంధించి డీసీపీ కమలాసన్ రెడ్డి గురువారం మాట్లాడుతూ.. ఏపీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిలో రూ.920 కోట్లకు పైగా ఉన్నాయి.

కార్మిక నిధి

కార్మిక నిధి

విభజన చట్టాన్ని ఉల్లంఘించి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రూ.410 కోట్లను మురళీసాగర్, రామారావులు ఏపీ కార్మిక శాఖ ఖాతాకు మళ్లించారు.

కార్మిక నిధి

కార్మిక నిధి

ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ ద్వారా గురువారం ఈ పని చేశారు. ఇందుకు సంబంధించిన ఫైళ్లను కూడా మాయం చేశారు. ఈ విషయం తెలుసుకున్న హెచ్ఎంఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. మురళీ సాగర్ గదిలో తనిఖీలు చేశారు.

కార్మిక నిధి

కార్మిక నిధి

కాగా, ఈ మళ్లింపు పైన తెలంగాణకు చెందిన పలువురు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన మండిపడ్డారు. కార్మికనిధి లూటీ, బాబు కుతంత్రం! అంటూ నమస్తే తెలంగాణలో కథనం వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+