9నెలలకు, సునంద వేసుకొచ్చిన దుస్తులు మిస్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్‌కు చెందిన మూడు మొబైల్ ఫోన్‌లు, లాప్‌టాప్‌ను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. వాటిని పరిశీలించేందుకు గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు.
345 నెంబర్ గది నుండి బెడ్ షీట్, కార్పెట్, విరిగిన గ్లాస్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని కూడా పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపించారు. కాగా, సునంద పుష్కర్ మృతి కేసులో పోలీసులు హోటల్ ఉద్యోగులను ప్రశ్నించారు.

సునంద వస్తువులు మిస్
సునంద మృతి చెందిన తొమ్మిది నెలల అనంతరం ఆమెకు చెందిన కొన్ని వస్తువులు అదృశ్యమైనట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. సునంద హోటల్ గదిలోకి వేసుకెళ్లిన దుస్తులు, చెప్పులు అదృశ్యమయ్యాయట. పోలీసులు గతవారం సునంద మరణించిన లీలా ప్యాలెస్ హోటల్‌లోని 345 గదిని మరోమారు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈ కొత్త విషయాలు వచ్చాయని సమాచారం. సునంద హోటల్ గదికి వచ్చిన సమయంలో వేసుకొచ్చిన దుస్తులు లభించలేదని పోలీసులు చెప్పారు. సునంద మృతి చెందినప్పుడు నైటీలో ఉన్నారు. ఆమె చెప్పులు, హ్యాండ్ బ్యాగ్ కూడా దొరకలేదని పోలీసులు చెబుతున్నారు.
సునంద దుస్తులు, చెప్పులను ఎవరో అక్కడి నుంచి తరలించి ఉంటారని తాజా పరిశీలనలో పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఇదిలా ఉండగా.. చనిపోయే ముందు గదిలోకి వెళ్లిన సునంద హ్యాండ్ బ్యాగ్ లాంటిదేమీ తీసుకెళ్లలేదని చెప్పారు. అయితే గదిలో అదృశ్యమైన వస్తువుల్లో ఆమె హ్యాండ్‌బ్యాగ్ కూడా ఉందని చెప్పడం విశేషం.
హోటల్ సిబ్బందిని ప్రశ్నించినప్పుడు సునంద పుష్కర్‌కు చెందిన అదృశ్యమైన వస్తువుల గురించి ఏం చెప్పారనేది తెలియాల్సి ఉంది. సునంద పుష్కర్ జనవరి 17వ తేదీన తాను ఉన్న హోటల్ గదిలో మృతి చెందిన విషయం తెలిసిందే. దీని పైన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆమె మృతి చెందిన సమయంలో ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉన్నారు.












Click it and Unblock the Notifications