వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగ్గురు పిల్లలు దావూద్ వేటకు వెళ్లారు

By Pratap
|
Google Oneindia TeluguNews

Dawood
పాట్నా: బీహార్‌లో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. చదువును ద్వేషించే ముగ్గురు పిల్లలు ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి వెళ్లారు. దావూద్‌ను పట్టించి, రివార్డును సొంతం చేసుకోవాలని వారు భావించారట. ఈ మేరకు హిందూస్తాన్ టైమ్స్‌లో ఓ వార్తాకథనం వచ్చింది.

బీహార్‌లోని పాట్నాలో గల సెయింట్ మైఖైల్ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు పిల్లు భారత భద్రతా సంస్థలు చేయలేని పనిని తాము చేయాలని అనుకున్నారు. దావూద్‌ ఇబ్రహీంను పట్టుకోవడానికి ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు.

ఆ పిల్లలు శుక్రవారంనాడు కనిపించకుండా పోయారు. దాంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు వారి ఫోన్‌లపై నిఘా వేశారు. వారు ఢిల్లీలో ఉన్నట్లు పోలీసులు కనిపెట్టారు. ఢిల్లీ పోలీసుల సహకారంతో పోలీసులు ముగ్గురిలో ఓ బాలుడిని పట్టుకోగలిగారు. ఆదివారంనాడు ముగ్గురు పిల్లలను పాట్నాకు తీసుకుని వచ్చారు. పోలీసుల విచారణలో ఆ బాలుడు అసలు విషయం చెప్పాడు.

తమకు చదువుపై ఇష్టం లేదని, దీంతో దావూద్‌ను పట్టుకోవడానికి వెళ్లామని ఆ బాలుడు చెప్పినట్లు పాట్నా ఎస్ఎస్‌పి మను మహరాజ్ చెప్పారు. దావూద్‌ను పట్టుకుని భారత్‌కు అప్పగిస్తే తమకు కోట్లాది రూపాయలు రివార్డుగా దక్కుతాయని, దాంతో వినోదించవచ్చునని భావించామని ఆ బాలుడు చెప్పాడు.

ముగ్గురు బాలురు కూడా పాట్నాకు వంద కిలోమీటర్ల దూరంలో గల మోకామాకు చేరుకున్నారని, అక్కడి నుంచి కోల్‌కతా వెళ్లారని పోలీసులు చెప్పారు. అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్నారని చెప్పారు. ఢిల్లీలో వారు పోలీసులకు చిక్కారు.

English summary
They hated studies but wanted to make plenty of money. So, they hit upon a wild idea to catch fugitive Mumbai underworld don Dawood Ibrahim, now believed to be in Pakistan, and claim the reward on his head.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X