విమానంలో షాక్: కాక్‌పిట్‌లో పైలట్‌ని కొట్టిన కోపైలట్
జైపూర్: ఎయిర్ ఇండియా విమానంలో పైలట్, కో పైలట్‌లు కలహించుకున్నారు. ఇప్పటికే విమానాల ప్రమాదాల పైన అందరూ ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో కాక్‌పిట్‌లో పైలట్, కో పైలట్ పరస్పరం తిట్టుకోవడం, కొట్టుకోవడం గమనార్హం. ఈ సంఘటన ఆదివారం నాడు జైపూర్‌లో చోటు చేసుకుంది.
ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ ఏ 320 విమానం ఢిల్లీకి ప్రయాణించేందుకు విమానంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పైలట్‌ను కోపైలట్ తిట్టడమే కాకుండా కొట్టాడని కూడా తెలుస్తోంది.
ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి ఒకరు ఆదివారం మాట్లాడుతూ.. వారిద్దరి మధ్య వాగ్వాదం మాత్రమే జరిగిందని, అంతకుమించి ఏం జరగలేదని తెలిపారు.

కానీ, సమాచారం మేరకు.. విమానానికి సంబంధించిన కొన్ని వివరాలు నమోదు చేయాలని కో పైలట్‌ను కమాండర్ ఆదేశించాడు. విమానంలో బోర్డ్ అయిన ప్రయాణీకుల సంఖ్య, ఫ్యూయర్ అప్ డేట్స్ తదితరాలు రాయాలని సూచించాడు.
కోపైలట్ కమాండర్ చెప్పిన పని చేయకుండా.. అతనిని తిట్టాడు. అంతేకాదు కొట్టాడు కూడా. విమానం వెళ్తుండగా ఈ సంఘటన కొనసాగింది. అయితే, కమాండర్ ఢిల్లీకి వెళ్లే వరకు ఓపిక పట్టాడు. దీంతో, జైపూర్‌లో విమాన ఆగాల్సి ఉన్నప్పటికీ ఆగలేదు. ప్రయాణీకులు అక్కడే ఉండిపోయారు. ఈ ఘటన పైన పైలట్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు కోపైలట్ మానసిక పరిస్థితిపై ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, అనంతరం ఈ విషయం సెటిల్ అయిందని చెప్పారు. మరోవైపు, కో పైలట్ పైన ఇలాంటి ఆరోపణలే గతంలోను ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మూడేళ్ల క్రితం ఓ కమాండర్ కాక్ పిట్‌లో ఉన్న సమయంలో ఇదే కో పైలట్.. అతనిని పిలిచి, తన షర్ట్ కాలర్ పైన ఉన్న స్టార్స్ తీసేయాలని చెప్పాడు. అతనితో వాగ్వాదానికి కూడా దిగాడు.












Click it and Unblock the Notifications