లాలూ ట్విస్ట్: పెద్దకొడుకు 25, చిన్నకొడుకు 26 ఏళ్లు
పాట్నా: బీహార్ శాసన సభ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తనయులు తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్‌లు పోటీ చేస్తున్నారు. తనయుల అఫిడవిట్ లాలూ ప్రసాద్‌కు కొత్త చిక్కులు తెచ్చింది. అన్నయ్య కంటే తమ్ముడు పెద్దవాడిగా పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేశారని తెలుస్తోంది.
వైశాలి జిల్లాలోనిమహువా నియోజకవర్గం నుంచి పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ బరిలోకి దిగుతున్నారు. చిన్న కుమారుడు తేజస్వీ అదే జిల్లాలోని రఘోపూర్ బరిలోకి దిగుతున్నాడు. పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్.. సోమవారం తండ్రి (లాలూ)తో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేశాడు.

చిన్న కొడుకు శనివారమే నామినేషన్ వేశాడు. లాలూ కొడుకులిద్దరూ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు ప్రస్తుతం రాష్ట్రంలో పెద్ద చర్చకు తెరతీశాయి. పెద్ద కుమారుడు తేజ్ తన వయసును 25 ఏళ్లుగా పేర్కొన్నారు. అయితే అతడి కంటే చిన్నోడైన తేజస్వీ మాత్రం తన వయసును 26 ఏళ్లుగా పేర్కొన్నాడు.
అయితే ఇప్పటికిప్పుడు ఈ అంశం ఆధారంగా నామినేషన్లను తిరస్కరించే అవకాశం లేదని బీహార్ అదనపు ఎన్నికల అధికారి లక్ష్మణన్ చెప్పారు. ఈ విషయంలో కోర్టులో తాము దాఖలు చేయనున్న పిటిషన్ల విచారణకు హాజరయ్యే అభ్యర్థులు తాము పొందుపరచిన వివరాలు వాస్తవమేనని నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. దీంతో, సామాజిక అనుసంధాన వేదికల్లో సెటైర్లు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications