సుజనాకు షాక్: ఆయనకు ఐడియా లేదన్న బాబు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై అంతే తానై మాట్లాడుతున్న కేంద్ర మంత్రి సుజనా చౌదరికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చారు. సుజనా చౌదరి ఐడియా లేకుండా మాట్లాడుతున్నారని, రాష్ట్రానికి ప్యాకేజీ కాదు.. విభజన సమయంలో కేంద్రం విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయాల్సిందేనని ఆయన అన్నారు.
సుజనా చౌదరితో అన్నీ మాట్లాడుతానని కూడా చంద్రబాబు అన్నారు. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించిన తీరుపై, పార్టీల వైఖరిపై, పార్లమెంటులో ఆమోదంపై ఆయన వివరణ పత్రం -2ను విడుదల చేశారు.

పార్టీలన్నీ ఎపికి ప్రత్యేక హోదా అడుగుతుంటే కేంద్ర మంత్రి సుజనా చౌదరి నెలాఖరులోగా కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తుందని సుజనా చౌదరి చెప్పిన విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు చంద్రబాబు ఆ విధంగా ప్రతిస్పందించారు.
చౌదరిగారికి ఐడియా లేక అలా మాట్లాడుతున్నారని చంద్రబాబు చెప్పారు తప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందా,త లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఎన్డీఎ హయాంలో మూడు రాష్ట్రాల విభజన జరిగినా ఎటువంటి ఇబ్బందులు రాలేదని ఆయన గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications