ప్లాఫ్ షోగా కాంగ్రెస్ ధర్నా: వీహెచ్‌ను తిట్టుకున్న నేతలు
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఎల్బీ నగర్ చౌరస్తాలో ధర్నా చేశారు. ఈ ధర్నాలో భాగంగా అవినీతి కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. రహదారిపై బైఠాయించి ప్రధాని నరేంద్రమోడీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దిష్టి బొమ్మలను దహనం చేశారు.
అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేపట్టిన ఈ షో ఫ్లాప్ షోగా మారిందని కొందరు నేతలు అనుకుంటున్నట్లు సమాచారం. అందుకు కారణం నేతలెవరికీ చెప్పకుండా ధర్నాకు ఏర్పాట్లు చేశారని వీహెచ్‌పై గుర్రుగా ఉన్నారంట. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరు వి. హనుమంతురావు.
అంతేకాదు హైకమాండ్ వద్ద పలుకుబడి ఉన్న నేతల్లో ఒకరు. వయసుకు మించిన బాధ్యతలను ఎత్తుకుంటారు. ఇంతకీ ఈ ధర్నా అట్టర్ ఫ్లాప్ షో అవడానికి కారణం ధర్నా సమయానికి అరగంట ముందు నేతలకు సమాచారం ఇచ్చాడంట. కాంగ్రెస్‌లో సీనియర్ నేత ధర్నాకు పిలిచాడు.

ప్లాఫ్ షోగా కాంగ్రెస్ ధర్నా: వీహెచ్‌ను తిట్టుకున్న నేతలు
కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఎల్బీ నగర్ చౌరస్తాలో ధర్నా చేశారు. ఈ ధర్నాలో భాగంగా అవినీతి కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.

ప్లాఫ్ షోగా కాంగ్రెస్ ధర్నా: వీహెచ్‌ను తిట్టుకున్న నేతలు
పోకపోతే ఏమనుకుంటాడనే ఉద్దేశ్యంతో వి. హనుమంతురావు పిలిచిన చోటికి హాడావుడిగా వెళ్లారంట నేతలంతా. ధర్నా చేస్తున్న చోట మీడియా లేకపోవడంతో నేతలంతా ఖంగుతిన్నారంట.

ప్లాఫ్ షోగా కాంగ్రెస్ ధర్నా: వీహెచ్‌ను తిట్టుకున్న నేతలు
ఇదేంటి ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేస్తుంటే మీడియాకు సమాచారం ఇవ్వలేదా అని టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడున్న నేతలను ప్రశ్నించాడట. అయితే వి. హనుమంతురావే విషయం లీక్ అవుతుందని మీడియాకు చెప్పలేదని వీహెచ్ సెలవివ్వడంతో కాంగ్రెస్ నేతలు విస్తుతపోయారంట.

ప్లాఫ్ షోగా కాంగ్రెస్ ధర్నా: వీహెచ్‌ను తిట్టుకున్న నేతలు
వీహెచ్ తీరుతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు లోలోపలనే తిట్టుకున్నారంట. మీడియాకు కూడా సమాచారం ఇవ్వకపోడవంతో కాంగ్రెస్ నేతలు తలపెట్టిన ధర్నా అట్టర్ ఫ్లాఫ్ అయిందని అందరూ బాధపడుతున్నారంట.

ప్లాఫ్ షోగా కాంగ్రెస్ ధర్నా: వీహెచ్‌ను తిట్టుకున్న నేతలు
ధర్నాకు మీరంతా రండి అంటూ కాంగ్రెస్నేతలకు, కార్యకర్తలకు ఫోన్ చేసి మరీ పిలిచిన వీహెచ్ మాత్రం తీరిగ్గా వీలు చూసుకుని ధర్నా వద్దకు వచ్చాడంట.

ప్లాఫ్ షోగా కాంగ్రెస్ ధర్నా: వీహెచ్‌ను తిట్టుకున్న నేతలు
ఈ ధర్నాలో తెలంగాణ ఇన్‌ఛార్జి కుంతియా, టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, వీహెచ్, దానం నాగేందర్, మాజీ ఎంపీ పొన్నం, షబ్బీర్ అలీలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications