ఫేస్‌బుక్ పేజీ: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టార్గెట్

విజయవాడ: నోటుకు ఓటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సవాల్ చేస్తూ ఓ గ్రూప్ నెటిజన్స్ మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ ఫేస్‌బుక్‌లో పేజీని ప్రారంభించారు. ఈ ప్రచారానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు గానీ తమపై కేసు వేయవచ్చునని నెటిజన్లు సవాల్ చేశారు.

నోటుకు ఓటు కేసులో చంద్రబాబు తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు సంభాషించినట్లు చెబుతున్న ఆడియో టేప్ విడుదలైన తర్వాత ఫేస్‌బుక్‌లో ఆ పేజీ ప్రారంభమైంది. నోటుకు ఓటు కేసుకు సంబంధించి అప్పటి నుంచి వందలాది పోస్టులు పోస్టయ్యాయి. చాలా మంది చంద్రబాబు వ్యాఖ్యలను అపహాస్యం చేస్తూ కామెంట్లు పోస్టు చేశారు.

 Facebook page on cash-for-vote dares Andhra Pradesh to sue them

మనవాళ్లు బ్రీఫ్ట్ మీ అనే పేజీకి అడ్మిన్ తానేనంటూ ప్లకార్డులు పట్టుకుని దిగిన ఏడు ఫొటోలను కూడా పోస్టు చేశారు. తనపై కేసు పెట్టవచ్చునని సవాల్ చేశారు. ఆ చిత్రాల్లో కనిపించినవారు తామే పేజీ అడ్మినిస్ట్రేర్లమంటూ ప్రకటించుకున్నారు.

అడ్మిన్లుగా చెబుకుంటూ పోస్టు చేసిన చిత్రాల్లో ఒక్కటి చేగొండి చంద్రశేఖర్ అనే వ్యక్తిది. ప్రొఫైల్‌ను బట్టి ఆయన ఫిల్మ్ డైరెక్టర్ అని తెలుస్తోంది. నోటుకు ఓటు కేసు తుది దశకు చేరుకునే వరకు ఈ పేజీని నడిపిస్తామని చెబుకున్నారు.

సోషల్ మీడియాలో చంద్రబాబుపై కామెంట్లు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరించిన తర్వాత ఈ పేజీ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్, తదితర టిడిపి నాయకులను అడ్మినిస్ట్రేర్లు టార్గెట్ చేసుకున్నారు. తాము తెలంగాణ మద్దతుదారులమని కూడా చెబుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+