వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రోళ్ల పెత్తనం: స్టేజ్ పైన ఎర్రబెల్లి వర్సెస్ కడియం

By Srinivas
|
Google Oneindia TeluguNews

వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వరంగల్ పార్లమెంటు సభ్యుడు కడియం శ్రీహరి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావుల మధ్య ఆదివారం నాడు తీవ్ర వాగ్వాదం జరిగింది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లిలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అన్న మాదిరిగా అది కనిపించింది.

ఆంధ్రోళ్ల పెత్తనంపై తలెత్తిన వ్యాఖ్యలు వారి మధ్య గొడవకు దారి తీసింది. మిషన్ కాకతీయ వేదికపైనే వీరు నిలదీసుకున్నారు. ఆంధ్రోళ్ల పెత్తనం పోయింది, వాళ్ల కింద పని చేయాల్సిన పరిస్థితి ఇంకేముందంటూ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలను తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తిప్పికొట్టేందుకు ప్రయత్నించడంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం తలెత్తింది.

మిషన్ కాకతీయలో భాగంగా కాట్రపల్లి గ్రామం పెద్దచెరువులో పూడికతీత పనులను కడియం ఆదివారం ప్రారంభించారు. అంతకుముందు సభలో కడియం ఆంధ్రోళ్ల పెత్తనమంటూ మాట్లాడారు. కాట్రపల్లిలో వేదిక పైకి వచ్చిన ఎర్రబెల్లి.. ప్రభుత్వ పథకాల ప్రారంభ సమయాల్లో వేదికలపై ఇతర రాజకీయ నేతలను విమర్శించడం తగదన్నారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.

Kadiyam versus Erraballi in Warangal

తెలంగాణ అభివృద్ధిలో తమవంతు పాత్ర ఉంటుందన్నారు. ఏనుగల్లు సభలో కడియం శ్రీహరి తనను విమర్శించినట్టు వార్తలొచ్చాయని, అలాంటి వ్యాఖ్యలు మానుకోవాలన్నారు. తాను ప్రజా పక్షపాతినని, తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలలో పాలుపంచుకుంటున్నాన్నారు. అనుచిత వ్యాఖ్యలు మానుకుని, నియోజకవర్గ అభివృద్ధికి కడియం కృషి చేయాలన్నారు.

కడియం మాట్లాడుతూ.. పాలకుర్తి అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. అయితే ఏనుగల్లులో తాను ఎవరినీ విమర్శించలేదని, ఆంధ్రోళ్ల పాలనపోయింది కనుక, పెత్తనం ఇంకెందుకమని మాత్రమే అన్నానని, వాళ్లకింద పని చేయాల్సిన పని ఇంకేముందన్నారు. ఇప్పుడు అదే అంటున్నానన్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.

ఎర్రబెల్లి లేచి నువ్వు గతంలో ఆంధ్రోళ్ల కింద పని చేయలేదా? నువ్వు చేసిందేమిటి? పిచ్చిమాటలు మాట్లాడొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరి నేతల మధ్య మాటామాటా పెరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ వేదికపైనే వాగ్వాదానికి దిగారు. నేతల మధ్య ఘర్షణతో ఇరువర్గాల కార్యకర్తలు ఉద్రిక్తతలకు లోనయ్యారు. ఈ సందర్భంగా తెరాస నేతలు జై తెలంగాణ అనగా, టీడీపీ నేతలు జై టీడీపీ అన్నారు.

English summary
Kadiyam versus Erraballi in Warangal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X