తెరపైకి మళ్లీ ముద్రగడ: చంద్రబాబుకు వార్నింగ్

హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, కాపునేత ముద్రగడ పద్మనాభం మళ్లీ తెర మీదికి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఆయన రాజకీయం చేసేందుకు పూనుకున్నట్లు కనిపిస్తున్నారు. కాపు సామాజిక వర్గంలో ఆయనకు బలం ఉంది.

కాపు సామాజిక వర్గాన్ని బిసి జాబితాలో చేర్చాలని, లేని పక్షంలోఉద్యమాన్ని చేపట్టి ఉధృతం చేస్తామని ఆయన ప్రకటించారు. కాపులకు రిజర్వేషన్ వర్తింపచేసే అంశంలో ఇక ఎంతమాత్రం జాప్యం చేయకూడదన్నారు. టిడిపి ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 30ను అమలు చేయడం కోసం బిసి కమిషన్ నివేదికను తెప్పించుకోవాలని చెప్పారు.

Kapu leader Mudragada Padmanabham warns Chandrababu Naidu

కాపులకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసి సాలీనా వెయ్యి కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలన్నారు.కాపు జాతికి కోపం వస్తే చరిత్ర తిరగ రాయడానికి వెనకాడరని ముద్రగడ అన్నారు. ముద్రగడ పద్మనాభం గత రెండు నెలల్లో రెండు సుదీర్ఘ లేఖలను చంద్రబాబుకు రాశారు.

విజయదశమి తర్వాత కాపులను బిసిల్లో చేర్చాలనే డిమాండ్‌తో ముద్రగడ ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. కాపులను బిసీ జాబితాలో చేర్చి బిసి కార్పోరేషన్‌కు 2 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని, లేనిపక్షంలో చంద్రబాబు కాపుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని ముద్రగడ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+