'తోటపల్లి'పై ప్రశ్నించినందుకు రైతుకు కెసిఆర్ చివాట్లు
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కోపమొచ్చింది. తాను ప్రసంగిస్తున్న సమయంలో ఓ సాధారణ రైతు నిలదీయడంతో అతని పైన మండిపడినట్లుగా వార్తలు వస్తున్నాయి. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ బహిరంగసభలో కెసిఆర్ ప్రసంగిస్తున్న సమయంలో ఓ రైతు ప్రశ్నించారు.
మిడ్ మానేరు నుంచి, కాళేశ్వర ఎత్తిపోతల పథకం నుంచి సాగు నీరు తీసుక వచ్చి హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. దీంతో, సదరు రైతు తోటపల్లి రిజర్వాయర్ గురించి ప్రస్తావించారు.
తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేశారని, అలాంటప్పుడు నీరేలా తీసుకు తెస్తారన్నారు. ఒగులాపూర్‌కు చెందిన మహిపాల్ రెడ్డి అనే రైతు ప్రశ్నించారు. దీంతో కేసీఆర్ అతని పైన మండిపడ్డారు.

పిచ్చోడిలా అరవొద్దని, నీకే బాగా తెలుసా.. నాకు తెలియదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకన్న నీకు ఎక్కువ తెలుసా.. తోటపల్లి రిజర్వాయర్ కడితే నీళ్లు తెస్తావా? నాకే అడ్డం మాట్లాడతావా? అడిగేందుకు బుద్ధుందా.. అక్కడొకడు.. ఇక్కడొకడు.. వినాలని కోపడ్డారని తెలుస్తోంది.
మహిపాల్ రెడ్డిని బయటకు పంపాలని పోలీసులు ప్రయత్నించగా, కేసీఆర్ వారిని వారించారు. అతడిని అక్కడే ఉండనీయాలని సూచించారు. సభ ముగిశాక.. పోలీసులు మహిపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications