టీడీపీపై బీజేపీ ఆసక్తికర వ్యాఖ్య, అరుణ ఫైర్(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన సభ లాబీల్లో బుధవారం నేతల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నేత, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లాబీల్లో మీడియాతో కిషన్ మాట్లాడుతుండగా.. తెరాస ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎదురు పడ్డారు. ఈ సమయంలో వారిద్దరి మధ్య చర్చ సాగింది.
జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ - ఖమ్మం గ్రాడ్యుయేట్స్ స్థానాలు తెరాస గెలుచుకుంటుందని చెప్పారు. ఈ రెండింటితో పాటు గ్రేటర్ హైదరాబాద్, సనత్ నగర్ ఉప ఎన్నికల్లోను తెరాస గెలుస్తుందన్నారు.

డీకే అరుణ
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ కూడా తెరాస పైన తీవ్ర ఆరోపణలు చేసింది. తెలంగాణ అసెంబ్లీలోకి మద్యం సిండికేటును తీసుకు వచ్చారని, అది తెరాస పనేనని ఆరోపించారు.

డీకే అరుణ
తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన అనంతరం వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ.

గీతా రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గీతా రెడ్డి దృశ్యం.

ఎన్వీఎస్ఎస్
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద బుధవారం నాడు మాట్లాడుతున్న బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.

ఎన్వీఎస్ఎస్
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద బుధవారం నాడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌తో చేయి కలుపుతున్న ఎమ్మెల్యే.
ఎన్నికల్లో బీజేపీ బాగానే ఈత కొడుతోందని, కానీ ఈత రాని టీడీపీతో కలిసి బీజేపీ మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. తెరాస పార్టీ ఇంకా భ్రమల్లో ఉందని, తమకు ఈత వచ్చని, అలాగే ఈతరాని వాళ్లను కూడా నీళ్లలో మునిగిపోకుండా బతికించుకోవడం తమకు తెలుసునని టీడీపీని ఉద్దేశించి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ కూడా తెరాస పైన తీవ్ర ఆరోపణలు చేసింది. తెలంగాణ అసెంబ్లీలోకి మద్యం సిండికేటును తీసుకు వచ్చారని, అది తెరాస పనేనని ఆరోపించారు. దీని పైన తెరాస ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మాట్లాడారు. తాను పీఆర్వోని నియమించుకున్నానని, అతను మద్యం వ్యాపారి కాదని తెలిపారు.












Click it and Unblock the Notifications