వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మాయి పేరు కంప్యూటర్, అబ్బాయి పేరు న్యూట్రాన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో కొత్త కొత్త పేర్లు సందడి చేస్తున్నాయి. కొందరు తమ పిల్లలకు వివిధ రకాల పేర్లు పెడుతున్నారు. అవి ఆసక్తిని రేపుతున్నాయి. కంప్యూటర్, ప్రొటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ అంటూ తమ పిల్లలకు ఆసక్తిని కలిగించే పేర్లు పెడుతున్నారు.

తమిళనాడులోని పుదుక్కోటై జిల్లా కొత్త మంగళానికి చెందిన రచయిత కన్నన్ తన కుమార్తెలకు కనిని (కంప్యూటర్), ఇనైయ (ఇంటర్నెట్) అని పేర్లు పెట్టి సైన్స్ పట్ల తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. తమిళనాడులో చాలామంది వైజ్ఞానిక, భాషాశాస్త్రాలపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.

Meet Proton, Neutron, Electron, part of Thirumullaivoyal Nuclear family

చెన్నై సమీపంలోని ఓ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి అరుల్ దాస్ కుటుంబాన్ని తెలిసిన వారు అటామిక్ ఫ్యామిలీ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన తన ముగ్గురు పిల్లలకు.. ప్రొటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ప్రొటాన్ ఐటీఐ పూర్తి చేశాడు. న్యూడ్రాన్ డిప్లోమా, ఎలక్ట్రాన్ 12వ తరగతి చదువుతున్నాడు.

భాషాభిమానులు కూడా ఉన్నారు. అరియలూరు జిల్లాలోని సెంధురైలోని ఓ విశ్రాంత ఉద్యోగి తన కుమారుడికి తని తమిళ కొట్రన్ (స్వచ్ఛ తమిళ రాజు) అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఆ తమిళ రాజు వైద్యుడిగా పని చేస్తున్నారు. ఆయన సోదరి పేరు కూడా తని తమిళనాడు (స్వచ్ఛ తమిళ దేశం). ఓ దర్జీ పేరు జాతి ఒళిప్పు (జాతి నిర్మూలన). తన తండ్రి తనకు ఈ పేరు పెట్టాడని ఆయన చెబుతున్నారు.

English summary
People of Tamil Nadu, for a long time, have a penchant for selecting unique names for their children.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X