వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆకలేస్తే భార్యలను తినేయండి: ఫత్వా జారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆకలేస్తే భార్యలను తినేయండంటూ ఓ ఫత్వా జారీ అయింది. భర్తకు అతిగా ఆకలేస్తే భార్యను తినవచ్చునని సౌదీ అరేబియాలో ఫత్వా జారీ అయింది. అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లా ఈ ఫత్వా జారీ చేశాడు. ఈ ఫత్వా వినేవాళ్లు ముక్కున వేలేసుకునే విధంగా ఉంది. ఇదేమిటి తిక్క ఫత్వా అని గొణుక్కుంటున్నారు.

భార్యలు తమ భర్తల రుణం తీర్చుకునేందుకే ఈ ఫత్వా విడుదల చేశామని ఆయనగారు సెలవిస్తున్నాడు. ఆకలేస్తే ఆహారం తినాలి గానీ ఇలా భార్యను తినడమేంట్రాబాబూ అంటూ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. మానవహక్కుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కుంటోంది.

Men can eat their wives if severely hungry, says top Saudi Sheikh's fatwa

ప్రపంచవ్యాప్తంగా ఇదిప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇదేకాదు, ఇలాంటి ఫత్వాలు తరుచూ జారీ అవుతూనే ఉంటాయి. ఆ మధ్య మహ్మద్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అనే సినిమా తమ మతాన్ని కించపరిచేలా ఉందని, ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడం సబబు కాదని ఏఆర్ రెహమాన్‌కు కూడా ఫత్వా జారీ చేశారు. మరో సందర్భంలో చర్చిలను కూలదోయండంటూ కూడా ఫత్వా జారీ చేసి సౌదీ ప్రభుత్వం వార్తల్లోకెక్కింది!

అత్యంత సంక్షోభ సమయంలో భార్య శరీర భాగాలను భర్త తినవచ్చునని ఆ ఫత్వా తెలియజేస్తోంది. అయితే, ఈ ఫత్వాను సౌదీ అరేబియా గ్రాండ్ ముఫ్తీ షేక్ వ్యతిరేకిస్తున్నారు. దీన్ని నకిలీ ఫత్వాగా కూడా అభివర్ణిస్తున్నారు. ఈ ఫత్వా గురించి వ్యంగ్యాత్మకమైన కాలమ్ మొరాకో బ్లాగర్ ఇజ్రాఫెల్ ఆల్ - మఘ్రాబీలో తొలిసారి అచ్చయింది.

English summary
The last time there was a mention of a fatwa was when one was issued against maestro AR Rahman for composing music for an Iranian film titled Muhammad: The Messenger of God, and he had given the Mumbai based Sunni Muslim group, Raza Academy a classic reply.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X