విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నమస్తే తెలంగాణ కొలికి: అక్రమ కట్టడం బాబు ఇల్లు?

By Pratap
|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై సందు దొరికితే చాలు, నమస్తే తెలంగాణ దినపత్రిక విరుచుకుపడుతోంది. తాజాగా, చంద్రబాబును ఇరకాటంలో పెట్టే వార్తాకథనాన్ని శనివారంనాడు ప్రచురించింది. సర్కారు నిబంధన లు సామాన్యులకే గానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కావని ఉండవల్లి క్రిష్ణా కరకట్ట వద్ద ఏర్పాటు చేస్తున్న గృహమే సజీవ సాక్షిలా నిదర్శనమంటూ ఆ పత్రిక వ్యాఖ్యానించింది.

ఆ పత్రిక వార్తాకథనం ప్రకారం - కృష్ణానది కరకట్ట మీదున్న ఓ అక్రమ నిర్మాణాన్ని అధికారులు సీఎం నివాస గృహంగా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నా రు. నిరుడు డిసెంబరు 31న నది కరకట్ట ప్రాంతంలో పర్యటించిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అక్రమ కట్టడాల సంగతి తేలుస్తామని హెచ్చరించారు.

 namasthe Telangana Report: Chandrababu selected the residence is illegal construction

ఇంకా ఆ పత్రిక ఇలా రాసింది - నాలుగు నెలల కిందట జల వనరులశాఖ అధికారులు ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించడంతో తాడేపల్లి తహశీల్దారు ద్వారా 21 మంది అక్రమ కట్టడ యజమానులకు నోటీసులు జారీచేశారు. ప్రస్తుతం సీఎం బాబు నివాసగృహానికి ఎంపికచేసిన లింగమనేని రమేష్‌కు చెందిన అతిథి గృహానికి కూడా ఆ నోటీసు జారీ కావడం గమనార్హం.

రెవెన్యూ అనుమతులు కూడా లేని ఈ అతిథి గృహాన్ని సీఎం నివాస గృహంగా మార్చేందుకు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటం చూ సి స్థానికులు నివ్వెరపోతున్నారంటూ నమస్తే తెలంగాణ పత్రిక వ్యాఖ్యానించింది. దీనిని ఆసరాగా చేసుకుని కరకట్ట వెంబడి నదీ స్థలాన్ని ఆక్రమించి శాశ్వత భవనాలు నిర్మించుకున్న చాలా మంది తమ భవనాలను క్రమబద్దీకరించే పనుల్లో నిమగ్నమయ్యారు.

English summary
According to Namasthe Telangana daily - Andhra Pradesh CM Nara Chandrababu Naidu has selected illegal construction for his residence at Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X