సత్య నాదెళ్ల నిర్ణయం: మైక్రోసాఫ్ట్‌లో 4గురు రిజైన్
సియాటెల్: ప్రముఖ సాఫ్టువేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి నలుగురు సీనియర్ ఉద్యోగులు తప్పుకున్నారు. తాము బాధ్యతల నుంచి విరమించుకుంటున్నామని వారు రాజీనామాను సమర్పించారు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్వయంగా ఈ మెయిల్ ద్వారా సంస్థ ఉద్యోగికి తెలియజేశారు.
ఇంజినీరింగ్ విభాగాన్ని మూడు గ్రూపులుగా చేయాలని సత్య నాదెళ్ల నిర్ణయించారు. సత్య నాదెళ్ల నిర్ణయంతో వారు విభేదించారు. ఈ విషయాన్ని సత్య నాదెళ్ల అందులో వివరణ ఇచ్చారు.

డివైజెస్ గ్రూప్‌ను పర్యవేక్షిస్తున్న స్టీఫెన్ ఈలోప్, అడ్వాన్స్ టెక్నాలజీ హెడ్ ఎరిక్ రూడర్, బిజినెస్ సొల్యూషన్స్ విభాగం చీఫ్ కిరిల్ టటారినివ్‌లు మైక్రోసాఫ్ట్ సంస్థను వీడినట్లు చెప్పారు. స్టీఫెన్ ఈలోప్ నొకియాలో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉంటూ.. ఆ పదవికి రాజీనామా చేసి మైక్రోసాఫ్టులో చేరారు.
డివైజెస్ గ్రూప్‌ను పర్యవేక్షించేవారు. కాగా, కస్టమర్లకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సత్య నాదెళ్ల వివరించారు. మైక్రోసాఫ్ట్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పెన్ సైతం చాలాకాలం క్రితమే సంస్థకు రాజీనామా చేస్తానని తనకు తెలిపారన్నారు.












Click it and Unblock the Notifications