ఏంటిది! హైదరాబాద్‌పై కేసీఆర్‌కు ఏడేళ్ల బాలిక లేఖ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఏడేళ్ల బాలిక లేఖ రాసింది. హైదరాబాదులోని పారిశుద్ధ్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అంబర్ పేటకు చెందిన బాలిక గాయత్రి లేఖ రాసింది.

అంబర్ పేటకు చెందిన శ్రీధర్ ఇన్ఫోసిస్‌లో సాఫ్టువేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. అతనికి గాయత్రి అనే ఏడేళ్ల కూతురు ఉంది. ఆమె హిమయత్ నగర్లోని ఓ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది.

Seven year old girl writes letter to CM KCR

తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరి కోసం పార్టీ శ్రేణులు నగరంలో ప్రధాన రహదారులు, కూడళ్లలో జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో గులాబీమయం చేశారు. ప్లీనరీ ముగిశాక కూడా వీటిని తొలగించలేదు. దీంతో గాయత్రి ముఖ్యమంత్రికి లేఖ రాశారు.

హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెబుతున్నారని, కానీ నగరం అందవిహీనంగా మారిందని, పారిశుద్ధ్యం కొరవడిందని, సమస్య పరిష్కారం కావాలంటే ఏం చేయాలని తల్లిదండ్రులను ప్రశ్నించడంతో.. వారు ముఖ్యమంత్రికి లేఖ రాయాలని చెప్పగా ఆమె లేఖ రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+