జేసీ బరితెగింపు: లంచాలు తీసుకుని అభివృద్ధి చేస్తా
అమరావతి: జేసీ బ్రదర్స్ ఎం మాట్లాడినా సంచలనమే. అనంతపురం ఎంపీ జేపీ దివాకర్ రెడ్డి రాజకీయాల్లో తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. తాడిపత్రి మేయర్‌గా పనిచేసి, ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అన్నకు ఏమాత్రం తీసిపోకుండా సంచలన వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రజా ప్రతినిధిగా నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష బలంగా ఉంది. కానీ, ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. ఏం చేయాలి అంటూ ఇకపై తాను కూడా లంచాలు తీసుకుంటానని, వాటితోనే తన నియోజకవర్గాన్ని (తాడిపత్రి) అభివృద్ధి చేస్తానని ఆయన ప్రకటించారు.
మనం చనిపోయినా కనీసం కొద్దిరోజుల పాటైనా జనం మనల్ని గుర్తుంచుకొనేలా పనులు చేయాలి. తలుపులు మూసేసి విభజించిన కాంగ్రెస్ వారికి మాట్లాడే అర్హత లేదు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబులకు వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలియచేస్తే జనమే వారిని తంతారన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసి ప్రజలను మోసం చేసినందునే తాము తెలుగుదేశంలోకి వచ్చామన్నారు.

‘‘దేశంలో ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. నా నియోజకవర్గంలో రూ.30 లక్షలు పెట్టి కల్యాణమండపం కడుతున్నా. నాకు డబ్బులు ఎవరు ఇస్తున్నారు? చాలా మంది కాంట్రాక్టర్లు పర్సంటేజీలు ఇస్తామంటే నేను తీసుకోవట్లేదు. ఇక నుంచి లంచాలు తీసుకోవడం నేనే మొదలుపెడతా. లంచం తీసుకునే తాడిపత్రిని అభివృద్ది చేస్తా. లంచాలను డీడీల రూపంలో తీసుకుని ఏం ఖర్చు పెట్టానో రాస్తా'' అని జేసీ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.












Click it and Unblock the Notifications