హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీలో కాబోయే సీఎం హరీశ్ అంటూ విపక్షాల కామెంట్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ వర్షాకాల సమావేశాలు మంగళవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. మంగళవారం అసెంబ్లీలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అని అంటే ఠక్కున చెప్పే సమాధానం కేసీఆర్ అని.

కానీ రాష్ట్రంలోని విపక్షాల ఎమ్మెల్యేలను అడిగితే మాత్రం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావే తదుపరి సీఎం అనే సమాధానం వస్తుంది. ఇదే సరదాగా చెప్పిన విషయం ఎంతమాత్రం కాదు. సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా నిన్న విపక్ష ఎమ్మెల్యేలు కొందరు ఈ మేరకు సభలో ఆసక్తికర కామెంట్ చేశారు.

విషయానికి వస్తే మంగళవారం రైతు అత్మహత్యలపై అసంబ్లీలో చర్చ జరుగుతున్న సందర్భంలో తెలంగాణ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడేందుకు సిద్ధమవుతున్న సమయంలో సీఎం కేసీఆర్ సభ నుంచి బయటకు వెళ్లేందుకు తన సీట్లో నుంచి లేచారు.

ఇది గమనించిన ఎర్రబెల్లి దయాకర్ రావు ‘‘సీఎంగారు సభలో ఉండాలని కోరుకుంటున్నాం. నేను చెప్పేది ఆయన వినాలని అనుకుంటున్నాను'' అని అన్నారు. వెనువెంటనే విపక్షాలకు చెందిన సీట్లలోని కొందరు సభ్యులు ‘‘కాబోయే సీఎం ఉన్నారులే. ఆయన వింటారులే'' అంటూ మంత్రి హరీశ్ రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

టిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష ఆరోపణ

టిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష ఆరోపణ

రైతులను ఆదుకోవడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష పార్టీలు తెరాస సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందు వల్ల అన్ని వర్గాల సమస్యలు గట్టెక్కుతాయని భావించామని, కాని రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగడం విచారకరమని కాంగ్రెస్, టిడిపి, బిజెపి తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తాయి. రైతులపై రుణభారం పడకుండా బ్యాంకులు, వడ్డీవ్యాపారులు రుణాన్ని వసూలు చేయకుండా మూడేళ్లపాటు మారటోరియం విధించాలని డిమాండ్ చేశాయి.

టిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష ఆరోపణ

టిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష ఆరోపణ

తెలంగాణ శాసనసభ రైతుల సంక్షేమం సమస్యలపై రెండు రోజుల చర్చను మంగళవారం నేరుగా చేపట్టింది. ఈ సందర్భంగా టిడిఎల్‌పి నేత ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ ‘మంత్రులూ ఎదురుదాడికి దిగకండి. మన తెలంగాణ అనుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేద్దాం. ఆంధ్రోళ్లు, వాళ్లను, వీళ్లను పేరు చెప్పుకుంటూ పబ్బం గడపకండి' అన్నారు. కేంద్రం నుంచి కరవు సహాయం పొందడంలో ప్రభుత్వం విఫలమైందని, సకాలంలో నివేదికను పంపించి ఉండాల్సిందన్నారు.

 టిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష ఆరోపణ

టిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష ఆరోపణ

రైతులను అవహేళన చేసే విధంగా మాట్లాడరాదన్నారు. కేంద్రంలో బిజెపి, మా పార్టీ అలయెన్సు ఉందన్నారు. తెలంగాణ ధనిక రాష్టమ్రేనని, కాని ప్రజలు పేదలన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా జనం నమ్మలేదని, అధికారం పొందిన టిఆర్‌ఎస్ ప్రజలను వంచించరాదన్నారు. పత్తిపంటలకు గిట్టుబాటుధర కల్పించేందుకు సిసిఐ చైర్మన్‌ను హైదరాబాద్‌కు పిలిపించి మాట్లాడాలన్నారు.

 టిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష ఆరోపణ

టిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష ఆరోపణ

ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదర్శరైతు అని ఎకరానికి కోటి రూపాయలు పండిస్తే ఇజ్రాయేల్‌కు ఎందుకు వెళ్లడమన్నారు. పైగా ఇజ్రాయేల్ బృందంలో రైతులు ఉన్నారా అని అడిగారు. తక్కువ పొలంలో ఎక్కువ దిగుబడి తీసుకొచ్చే తన ఫాంహౌస్‌కు అన్ని పార్టీల ఎమ్మెల్యేలను కెసిఆర్ ఎందుకు తీసుకెళ్లలేదన్నారు. ఫాంహౌస్‌కు తీసుకెళితే తాము నేర్చుకుంటామన్నారు.

 టిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష ఆరోపణ

టిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష ఆరోపణ

ఫాంహౌస్, పోలీ హౌస్‌లకు సబ్సిడీలు ఇవ్వడం మాని పేద రైతులకు, చిన్న కమతాలు ఉన్న రైతులకు సబ్సిడీలు ఇవ్వాలన్నారు. గత ఏడాది రబీ ముందు పంటలు వేయవద్దని, కరెంటు లేదన్నారని, రబీ సీజన్ మధ్యలో కరెంటు ఇచ్చారని, దీని వల్ల రైతులు పంటలు వేసుకోలేక దెబ్బతిన్నారన్నారు. గత ఏడాది ఖరీఫ్,రబీ, తాజాగా ఖరీఫ్ పంటలు దెబ్బతిని రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కెసిఆర్ ఇచ్చిన హామీలు అన్నీ అమలుకావాలంటే 10 లక్షల కోట్ల రూపాయలు అవసరమన్నారు.

 టిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష ఆరోపణ

టిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష ఆరోపణ

రైతులకు మిగిలిన రుణాన్ని ఒకే సారి మాఫీ చేయాలన్నారు. బ్యాంకర్లు రైతులకు సహకరించడం లేదన్నారు. మండలాల్లో గోదాముల నిర్మాణం మంచి నిర్ణయమని స్వాగతిస్తూనే మంత్రి హరీష్‌రావు మార్కెట్ యార్డులను సందర్శించడం తగ్గించారన్నారు. మెదక్ జిల్లాలో రైతులకు చెరుకు బకాయిలను చెల్లించాలన్నారు.

 టిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష ఆరోపణ

టిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష ఆరోపణ

60 సంవత్సరాలు నిండిన రైతుకు పెన్షన్ ఇవ్వాలన్నారు. గత ఏడాది నల్లగొండ జిల్లాలో రైతులకు పలుకరించడానికి వెళితే తమ పార్టీపైన, తమపైన దాడులు చేశారని, తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఓదార్చే హక్కు లేదా అని ప్రశ్నించారు.

English summary
TDP MLAS protesting against the farmer's suicide near assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X