ఏదైనా పవన్ కళ్యాణ్‌కే ప్రశ్న: ఇప్పుడు నిరుద్యోగులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి సమస్య వచ్చినా జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌నే ప్రశ్నిస్తున్నారు. జాబు కావాలంటే బాబు రావాలి అన్నారని, బాబు వచ్చినా తమకు జాబు రాలేదని, బాబుకు జాబు రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ కనిపించడం లేదని ఎపి నిరుద్యోగులు అన్నారు.
చంద్రబాబు ఇచ్చిన హామీలకు పూచిగా తాను ఉంటానని పవన్ కళ్యాణ్ చెప్పారని, ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ మాట్లాడడం లేదని వారన్నారు. వయస్సు మీద పడుతున్నా ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం లేదని, సార్వత్రిక ఎన్నికలు జరిగి రెండేళ్లవుతున్నా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని వారు ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగుల ఐక్య వేదిక ఆధ్వర్వంలో హైదరాబాదులోని నాంపల్లి ఎపిపిఎస్సీ కార్యాలయం వద్ద బుధవారంనాడు నిరుద్యోగులు ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ వినూత్నంగా ప్లాస్టిక్ ప్లేటును ప్రదర్శిస్తూ బిక్షాటన చేశారు.
రోడ్డు మీద బైఠాయించారు. ఈ సందర్భంగా వారు పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు. ఈ ఐదేళ్లు నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలాన్ని వెళ్లదీస్తే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని నిరుద్యోగుల సంఘం నేత లగుడు గోవింద రావు అన్నారు.












Click it and Unblock the Notifications