రామరాజ్యంలోను రేప్‌లు, ప్రైవేట్‌గా కలిస్తే చెప్తా: డిజిపి
లక్నో: ఉత్తర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) జగ్మోహన్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అత్యాచారాల పైన ఆయన మంగళవారం వ్యాఖ్యానించి, తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రామరాజ్యంలోనూ అత్యాచారాలు జరిగాయని ఆయన వ్యాఖ్యానించాడు.
మహిళలకు వేధింపులు, అత్యాచారాలు పెరుగుతున్నాయని ఓ విలేకరి ప్రశ్నించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ... నీవు నన్ను ప్రయివేటుగా కలిస్తే దానికి సమాధానం చెబుతానని వ్యాఖ్యానించాడు. సదరు డిజిపి మరో నెలలో పదవీ విరమణ చేయనున్నాడు.

డిజిపి జగ్మోహన్ యాదవ్ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిపి అలా వ్యాఖ్యానించడం దారుణమన్నారు. ఆయనవి బాధ్యతారాహిత్య, ఘోరమైన వ్యాఖ్యలు అని మండిపడ్డారు.
డిజిపి అలా మాట్లాడినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతమూ అధికారంలో ఉన్న ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అత్యాచారాలపై గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications