హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అది ఆరడగుల బుల్లెట్: వీర్యం ఖరీదు ఎంతంటే..

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆ దున్న ఠీవీ చెప్పనలవి కాదు. దాని వయస్సు ఏడేళ్లు. దాని బరువు 1500 కీలోలు. దాని ఎత్తు ఆరు అడుగులు 15 ఫీట్ల పొడవుతో కళ్లుచెదిరే రాజసంతో ఉట్టిపడుతున్న ఈ దున్న ఖరీదు అక్షరాలా రూ.11 కోట్లు. హైదరాబాద్ నగరంలోని సదర్‌ ఉత్సవాల్లో విజేతగా నిలిచేందుకు రేసులో ఉంది.

ఈ దున్నపోతు వీర్యపు చుక్క ఖరీదు రూ.400. ఇలా వీర్యం అమ్ముకోవడం ద్వారానే ఏడాదికి కోటి రూపాయలకుపైగా సంపాదిస్తానని దీని యజమాని కరమ్‌బీర్‌ సింగ్‌ అంటున్నారు. ఇటీవల జరిగిన దేశవ్యాప్త జంతు ప్రదర్శనలో ప్రధాని మోడీ కూడా 'యువరాజ్‌'ను చూసి శభాష్‌ అన్నారట!

యువరాజ్‌కు పుట్టిన దున్న రూ.10 లక్షలకు అమ్ముడు పోయిందనీ చెప్పాడు. ఆకారానికి మల్లే యువరాజ్‌ ఆహారం ఖరీదు కూడా పెద్దదే. రోజుకు 15 కిలోల యాపిల్స్‌, 20 లీటర్ల పాలు, అయిదు కిలోల క్యారెట్‌, ఆరు కిలోల బెల్లం, కాజు, శనగలు అమాంతం తినేస్తుందట. దీనికి దాణా అదనం.

దానికి మసాజ్ ఇలా...

దానికి మసాజ్ ఇలా...

ఆ దున్నకు సంపంగి నూనెతో మసాజ్‌ చేయాల్సిందే. స్నానం చేయించాల్సింది. ఈ పనులకు ప్రత్యేకంగా నలుగురు పనివాళ్లు ఉన్నారు.

హర్యానా నుంచి ఇలా...

హర్యానా నుంచి ఇలా...

హర్యానాకు చెందిన కరమ్ వీర్ సింగ్ హైదరాబాద్‌లోని రామ్‌నగర్‌కు చెందిన ఎడ్ల హరిబాబు యాదవ్‌కు యువరాజ్‌ను బహుమతిగా ఇచ్చారు. దాని మొదటి పేరు ధారా బుల్.

ఎప్పుడూ దాన్ని అద్దెకే...

ఎప్పుడూ దాన్ని అద్దెకే...

కరమ్ వీర్ నుంచి హరిబాబు బాబు యాదవ్ రెగ్యులర్‌గా యువరాజ్‌ను అద్దెకు తీసుకుంటూ వచ్చారు. దాంతో అటువంటి దున్ననే తనకు కావాలని హరిబాబు యాదవ్‌కు చెప్పారు. దాంతో కరమ్ వీర్ సింగ్ దాన్ని హరిబాబు యాదవ్‌కు ఇచ్చారు. దానికి ఆ తర్వాత తెలంగాణ మహరాజ్ అని పేరు పెట్టారు.

ప్రదర్శనలో మహరాజ్ ఇలా..

ప్రదర్శనలో మహరాజ్ ఇలా..

సదర్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాదులోని చింతల్ బస్తీ, ఎల్లారెడ్డి గుడా, సైదాబాద్, తదితర ప్రాంతాల్లో జరిగిన ప్రదర్శనలో మహరాజ్‌ను ఉంచారు.

వచ్చే ఏడాది మహరాజ్

వచ్చే ఏడాది మహరాజ్

తెలంగాణ మహరాజ్ ధర పదికోట్ల రూపాయలు పలికింది. వచ్చే ఏడాది మహరాజ్ పోటీల్లో పాల్గొంటుందని హరిబాబు యాదవ్ చెప్పారు.

English summary
The celebrated Murra bull Yuvaraj’s offspring, Maharaj, that has been brought up in the city, will be available for the next Sadar festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X