కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండు జననాంగాలు: అతనిలోని ఆమెను తీసేశారు

By Pratap
|
Google Oneindia TeluguNews

ముస్తాబాద్: వైద్య చరిత్రలో అరుదైన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. స్ర్తి, పురుష జననాంగాలు గల ఒక బాలుడికి విజయవంతంగా శస్తచ్రికిత్స జరిపి, సంపూర్ణ పురుష లక్షణాలు కల్పించారు. ముస్తాబాద్‌లోని డాక్టర్ బ్రహ్మయ్య స్మారక పీపుల్స్ ఆసుపత్రిలో శుక్రవారం ప్రముఖ గైనకాలజిస్టు చింతోజు శంకర్ ఆధ్వర్యంలో అరుదైన శస్త్రచికిత్స జరిగింది.

స్ర్తి, పురుష లక్షణాలతో బాధపడుతున్న 13 ఏళ్ల బాలుడిలో స్ర్తి లక్షణాలు గల అండాశయం, గర్భాశయం, ట్యూబ్స్ తొలగించి, పొత్తికడుపులో ఉన్న వృషణాల్ని బయట అమర్చారు. ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లికి చెందిన కొర్ర భారతి శంకర్ దంపతుల కొడుకు వేణు కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు.

Karimnagar doctors does rare operation

ముస్తాబాద్ పీపుల్స్ ఆసుపత్రి గైనకాలజిస్టు శంకర్‌ను ఆశ్రయించగా, పరీక్షలు జరిపి, పురుష, స్ర్తి లక్షణాలు ఉండటాన్ని గుర్తించారు. బాలుడిలో అండాశయం, గర్భాశయం, ట్యూబ్స్, యోని ఉన్నాయి. పురుషాంగం ఉంది. యోని మార్గం ద్వారా మూత్ర విసర్జన జరిగేది.

స్ర్తి, పురుష హర్మోన్లు సరిసమానంగా ఉండటాన్ని వైద్య పరీక్షల ద్వారా గుర్తించారు. కడుపునొప్పి తగ్గాలంటే ఏదో ఒక లక్షణాలతో ఉండాలని చెప్పడంతో పురుష లక్షణాలు ఉండేలా శస్తచ్రికిత్స చేయాలని తల్లిదండ్రులు లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడంతో శుక్రవారం శస్తచ్రికిత్స జరిపారు. స్ర్తీ లక్షణాలు ఉన్న బాలుడు సంపూర్ణ పురుషుడిగా మారి, క్రమంగా కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు.

English summary
Karim Nagar district doctors dis a rare surgery to a boy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X