'మరుగుదొడ్లను క్లీన్ చేసిన టీఆర్ఎస్ ఎంపీ..' (ఫోటోలు)

Subscribe to Oneindia Telugu

చేవెళ్ల : విషయమేదైనా.. జనంలో చైతన్యం తీసుకురావాలంటే దాని బాధ్యతలను భుజాన వేసుకుని ముందుండి నడిపించే వ్యక్తులు అవసరం. ఆ వ్యక్తులు సెలబ్రిటీలో.. ప్రజాప్రతినిధులో అయితే విషయం ఇంకాస్త వేగంగా జనంలోకి వెళ్లడమే గాక సమస్యపై ప్రజల్లో త్వరగా అవగాహన ఏర్పడుతుంది. సరిగ్గా ఇదే పంథాలో పయనిస్తున్నారు చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

స్వచ్చ పాఠశాలల ఆశయమే ధ్యేయంగా.. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రతపై అవగాహన తీసుకొచ్చేందుకు స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. గతంలో టాయిలెట్ల క్లీనింగ్ కోసం ఓ వాహనాన్ని ఏర్పాటు చేసిన ఆయన, శుక్రవారం నాడు స్వయంగా వాహనాన్ని నడుపుకుంటూ ఆయా పాఠశాలలను సందర్శించారు.

ఈ క్రమంలో గొల్లపల్లి, ధర్మసాగర్ గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల మరుగుదొడ్లను తానే స్వయంగా శుభ్రపరిచారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తాను ఏర్పాటు చేసిన వాహనం ద్వారా టాయిలెట్ల క్లీనింగ్ కు ప్రత్యే క సౌకర్యం అందుబాటులోకి రావడంతో.. చీపురు లాంటి వస్తువులేమి అవసరం లేకుండానే ప్రెజర్ పంప్ తో మరుగుదొడ్లను శుభ్రపరించారు.

టాయిలెట్లను క్లీన్ చేసిన విశ్వేశ్వర్ రెడ్డి

టాయిలెట్లను క్లీన్ చేసిన విశ్వేశ్వర్ రెడ్డి

ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లను క్లీన్ చేసిన విశ్వేశ్వర్ రెడ్డి.. మరుగుదొడ్లను శుభ్రపరచడం సిగ్గుపడాల్సిన వ్యవహారం కాదని, శుభ్రతకు సంబంధించి గర్వపడాల్సిన విషయమని వివరించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో

ప్రభుత్వ పాఠశాలల్లో

ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల క్లీనింగ్ పై అవగాహన కల్పించేందుకు.. స్వయంగా తానే రంగంలోకి దిగిన విశ్వేశ్వర్ రెడ్డి స్వచ్చ పాఠశాలల ఆశయానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజాప్రతినిధిగా

ప్రజాప్రతినిధిగా

ప్రజాప్రతినిధిగా.. ఓ సామాజిక చైతన్యం కోసం ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కృషి చేయడం పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. కాగా, తన ఆలోచనను తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయడానికి.. తాజా కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు.

టాయిలెట్ల క్లీనింగ్

టాయిలెట్ల క్లీనింగ్

టాయిలెట్ల క్లీనింగ్ కోసం తన నియోజకవర్గంలో ఓ ప్రత్యేక వాహనాన్నే ఏర్పాటు చేశారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తద్వారా స్వచ్చ పాఠశాలల ఆశయమే కాకుండా, నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చనే ఉద్దేశంతోనే వాహనాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
MP Konda Vishweshwar Reddy cleaned toilets in Chevella govt schools. For the awarness of toilets cleaning in govt schools he arranged a seperate vehicle in his constituency.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి