1, జన్‌పథ్: కేసీఆర్ తనయ బాటలో ఢిల్లీకి లోకేశ్?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారా? అంటే అవుననే అంటున్నారు. జాతీయ నేతలతో సంబంధాలను మెరుగుపరచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు నారా లోకేశ్ పక్కా ప్రణాళిక రచించుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే చంద్రబాబు మాదిరి హైదరాబాద్‌లోని కుటుంబం కంటే విజయవాడలోని పార్టీ కార్యక్రమాల్లోనే ఎక్కువగా గడుపుతున్న ఆయన ఇకపై నెలలో రెండు, మూడు రోజులు ఢిల్లీలో ఉండేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఢిల్లీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

One Janpath Bungalow for Nara Lokesh in Delhi

తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన ప్రయోజనాలను రాబట్టుకునే విషయంలో కూడా ఆమె సఫలీకృతమవుతూనే ఉన్నారు. అప్పుడప్పుడు కేంద్ర మంత్రులతో భేటీ కావడంతో పాటు పలువురు జాతీయ స్థాయి నేతలకు విందులిస్తూ తన దైన శైలిలో దూసుకెళ్తున్నారు.

ఇప్పుడు ఏపీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నారా లోకేశ్ కూడా ఆ దిశగా అడుగులు వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీంతో ఇకపై నెలలో రెండు, మూడు రోజులు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీలో బసకు 1, జన్‌పథ్ బంగళాను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.

ఏపీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లిన సందర్భాల్లో అక్కడ ఉన్న ఏపీ భవన్ లోనే బస చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఏపీ భవన్‌ స్థలాన్ని తమకు కేటాయించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు.

ఈ క్రమంలో ఏపీ సీఎం హోదాలో ఢిల్లీకి వెళ్లే చంద్రబాబు బస కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్న 'జన్ పథ్'లోని ఒకటో భవంతిని చంద్రబాబు కోసం కేంద్రం కేటాయించింది. సీఎం హోదాలో ఆయన తండ్రికి కేంద్రం కేటాయించిన 1, జన్ పథ్ భవనానికి అధికారులు మరమ్మతులు చేస్తున్నారు.

చంద్రబాబుకు కేటాయించనున్న ఈ భవంతిలో చంద్రబాబు సహా ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉండేందుకు అవకాశం ఉంది. అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే నెల నుంచే నారా లోకేశ్ తన మకాంను ఢిల్లీకి మారుస్తారట. తద్వారా ఢిల్లీలోని జాతీయ స్థాయి నేతలతో పాటు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించే అవకాశం ఉంది.

తద్వారా ఏపీకి కేంద్రం నుంచి విడుదల కావాల్సిన నిధులు, ఇతర ప్రయోజనాలపై ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రులతో భేటీలు నిర్వహించొచ్చు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam Pary general secretary Nara Lokesh has decided to focus on relations at the national level and CM Chandrababu Naidu also gave a green signal to Lokesh and accordingly One Janpath bungalow will be alloted to Lokesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి