రెక్కలపై పాక్ లేఖ: గూఢచర్యానికి పావురం అరెస్టు
హోషియార్‌పూర్: పాకిస్తాన్ గూఢచర్యానికి పక్షులను కూడా వాడుకుంటుందో... ఓ సంఘటనను చూస్తే అఏవుననే అనిపిస్తోంది. వైమానిక స్థావరంపై ఉగ్రదాడితో సంచలనం రేపిన పఠాన్‌కోట్‌కు చేరువలో ఓ గూఢచర్య పావురాన్ని పంజాబ్ పోలీసులు గుర్తించారు.
పఠాన్‌కోట్‌కు 35 కి.మీ దూరంలో ముకేరియన్ సబ్ డివిజన్, మోట్లలోని ఓ ఇంట్లో వాలిన పావురం రెక్కలపై ఉర్దూలో సమాచారం రాసి ఉండడాన్ని గుర్తించారు. దాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
పావురం రెక్కలపై ఉర్దూలో అక్షరాలు ఉండడం వల్ల దాన్ని గూఢచర్యంగా భావిస్తున్నారు. పొరుగుదేశం నుంచి ఆ పావురాన్ని విడిచినట్లు అనుమానిస్తున్నారు. నీరసంగా ఉన్న ఓ పావురం తన ఇంట్లో వచ్చి వాలిందని, మర్నాడు గమనిస్తే.. పావురం రెక్కలపై ఉర్దూలో ఏదో రాసి ఉందని ఇంటి యజమాని నరేశ్‌కుమార్ పోలీసులకు తెలిపారు.
దాంతో పోలీసులు దాన్ని అదుపులోకి తీసుకున్నారు. యురి ఘటన నేపథ్యంలో భారత అధికారులు ఏ విషయాన్ని కూడా కొట్టేయడం లేదు. ప్రతిదాన్నీ నిశితంగా పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications