50 ఏళ్లు వచ్చినా యువకుడా: రాహుల్‌పై స్మృతి

లక్నో: యాభై ఏళ్ల వయస్సులో కూడా తాను యువననేతను అని చెప్పుకోవడం ఏమిటంటూ కేంద్రమంత్రి, బిజెపి నేత స్మృతి ఇరానీ ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన పరోక్షంగా శనివారం నాడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

రాహుల్ గాంధీ తాను 50 ఏళ్లకు దగ్గరవుతున్న విషయాన్ని మరచిపోయి, యువకుడినేనంటూ తిరుగుతున్నారని స్మృతి ఎద్దేవా చేశారు. తన తల్లి సోనియాగాంధీ అండతో పదేళ్లు ఎంపీగా ఉన్నప్పటికీ, అమేథీని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.

 Rahul Gandhi claims to be youth leader but is close to 50: Smriti Irani

బృందావన్‌లో జరిగిన బిజెపి యువమోర్చాలో ఆమె ప్రసంగించారు. రాహుల్ గాంధీ మాదిరిగా తాను ఎన్నడూ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయలేదన్నారు. తన రక్తం జాతీయవాదంతో నిండి ఉందన్నారు. తాను చేసే అభివృద్ధిపనులే మాట్లాడతాయన్నారు.

భారతావనిని ముక్కలు చేయాలన్న ఆలోచనతో ఉన్న వారిని ప్రతిపక్షాలు వెనకేసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో కేరళలో తరగతి గదిలో బిజెపి కార్యకర్తను హత్య చేసినప్పుడు వీరు ఎందుకు స్పందించలేదని ఆమె నిలదీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+