విశాఖ బదులు బెజవాడ: రైల్వేజోన్‌పై కేంద్రం మెలిక, అందుకే!
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు భారీ ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ రోజు ఆ ప్యాకేజీ పైన ప్రకటన చేసే అవకాశాలున్నాయనే వార్తలు వస్తున్నాయి. అదే విధంగా విశాఖ రైల్వే జోన్ బదులు విజయవాడకు రైల్వే జోన్‌కు కేంద్రం సుముఖత వ్యక్తం చూపుతోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి సభ ప్రభావం నేపథ్యంలో, అంతకుముందు కూడా ఏపీ ప్రజల ఆగ్రహం చవిచూరకుండా ఉండాలనే ఏపీ బీజేపీ నేతల సూచన మేరకు కేంద్రం ప్యాకేజీ పైన 'భారీ' కసరత్తు చేసింది. దీనిని ఈ రోజు ప్రకటించే అవకాశముంది.

ఏపీకి విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ను ప్రకటించాలన్న డిమాండ్ ఏపీ నుంచి మొదటి నుంచీ వినిపిస్తోంది. అయితే విశాఖ కాకుండా విజయవాడ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ను ప్రకటించేందుకు తాము సిద్ధమని కేంద్రం చెబుతోంది.
విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌కు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని కేంద్రం చెబుతోంది. ఈ క్రమంలో విజయవాడ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ కు ఒప్పుకుంటే అందుకు తాము సిద్ధంగానే ఉన్నామని కేంద్రం ఇప్పటికే ఏపీకి చెప్పిందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications