సవతి తల్లి దెయ్యం: తండ్రి నాలుగో పెళ్లిపై పూజా బేడీ
ముంబై: తన మారు తల్లి పైన నటి పూజా బేడీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'ప్రతి అద్భుతమైన కథలో ఓ చెడ్డ వ్యక్తి లేదా దెయ్యం ఉంటుంది. నా కథలో దెయ్యం సవతి తల్లి రూపంలో ఇప్పుడు వచ్చింది' అంటూ పూజా బేడీ సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
డెబ్బయ్యేళ్ల వయస్సులో తన దీర్ఘకాల స్నేహితురాలు పర్వీన్ దుసాంజ్‌ను పుజా బేడీ తండ్రి కబీర్ బేడీ వివాహం చేసుకున్నాడు. దీని పైన పూజా బేడీ తీవ్రంగా స్పందించారు. కబీర్‌కు, డ్యాన్సర్ ప్రొతిమాకు పూజా బేడీ జన్మించింది.

కాగా, కబీర్ వివాహం ఈ నెల పదిహేనవ తేదీన జరిగింది. ప్రొతిమా నుంచి విడిపోయిన అనంతరం కబీర్‌కు ఇది మూడవ వివాహం. ప్రొతిమా తరువాత ఫ్యాషన్ డిజైనర్ సుసాన్‌ను, ఆ తర్వాత టీవీ యాంకర్ నిక్కీ బేడీని ఆయన వివాహం చేసుకున్నాడు. మొత్తంగా నాలుగో వివాహం.
తండ్రి కబీర్ బేడీ వివాహానికి కూతురు పూజా బేడీ గైర్హాజరయ్యారు. పెళ్లి ఫోటోల్లో ఎక్కడా పూజా బేడీ కనిపించలేదు. తన తండ్రి కబీర్ బేడీ నిర్ణయం పట్ల కూతురు పూజాబేడీ పూర్తి అసహనంతో ఉన్నారని తెలుస్తోంది. ఆమె వ్యాఖ్యల ద్వారా మారు తల్లిని ద్వేషిస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications