డారెన్ సామీని ఫోన్‌కాల్‌పై 30 సెకన్లలో పీకేశారట
సెయింట్ జాన్స్ (ఆంటిగ్వా, బార్బుడా: రెండు సార్లు ట్వంటీ20 ప్రపంచ కప్‌ను అందించిన వెస్టిండీస్ జట్టుకు నాయకత్వం వహించిన డారెన్ సామీ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. తనకు 30 సెకన్ల ఫోన్ కాల్‌పై ఉద్వాసన పలికారని చెప్పాడు. సెలెక్టర్ల చీఫ్ ఫోన్ చేసి 30 సెకన్లు మాట్లాడి తనకు ఉద్వాసన చెప్పాడని ఆయన చెప్పారు.

ఉద్వేగభరితమైన మాటలతో కూడిన వీడియోను ఆ 32 ఏళ్ల వెస్టిండీస్ ఆటగాడు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఆరేళ్ల తన ఆట ముగిసిందని ఆయన చెప్పాడు. చొక్కా విప్పేసి, పడకపై పడుకుని రెగ్గీ సంగీతాన్ని ఆస్వాదిస్తూ తను జట్టు నుంచి తొలగించారని చెప్పాడు.
నాకు నిన్న ఫోన్ వచ్చింది. అది దాదాపు 30 సెకన్లు ఉండవ్చచు. ట్వంటీ20 జట్టు నాయకత్వ తీరును సమీక్షించామని, నువ్వు ఉండడం లేదని, తన ఆటతీరు జట్టులోకి తీసుకోవడానికి తగిన ప్రతిభ లేదని నాకు చెప్పారు అని వీడియోలో సామీ చెప్పాడు.
సామీ తన కెప్టెన్సీలో 2012లోనూ 2016లోనూ వెస్టిండీస్‌కు ట్వంటీ20 ప్రపంచ కప్2ను అందించాడు. వెస్టిండీస్‌కు నాయకత్వం వహించాలని ఆరేళ్ల కింద తనను అడిగారని, తన కెరీర్‌లోనూ జీవితంలోనూ అతి పెద్ద సవాల్ అని తాను అనుకున్నానని సామీ అన్నాడు.
ఆ లక్ష్యం ఎంత కష్టతరమైందో తనకు తెలుసునని, తను సవాల్‌ను స్వీకరించానని, కష్టాన్ని ఆలింగనం చేసుకున్నానని అన్నాడు. మైదానంలోకి దిగిన తర్వాత ప్రతి రోజూ తన కృషినంతా పెట్టానని చెప్పాడు. భారత్‌తో జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్ ముగిసిన తర్వాత వెస్టిండీస్ రెండు ట్వంటీ20 మ్యాచులు ఆడుతుంది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications