మా చీరలు చించుతారా: బాబు ప్రభుత్వంపై ఆగ్రహం

Posted By:
Subscribe to Oneindia Telugu

చిత్తూరు: ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఏపీలో నిరసనలు తెలుపుతున్నాయి. మంగళవారం నాడు ఏపీలో బంద్ నిర్వహించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా బందుకు పిలుపునిచ్చింది. ఈ బందుకు వివిధ పార్టీలు మద్దతు పలికాయి.

బంద్ సందర్భంగా తమ పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు చిత్తూరు జిల్లా తిరుపతిలో వైసిపి మహిళలు రోడ్డెక్కారు. నిన్న పోలీసులు తమ పట్ల ప్రవర్తించిన వైఖరికి తాము నిరసన తెలుపుతున్నామన్నారు.

ఈ సందర్భంగా వారు తమ చిరిగిన చీరలను ప్రదర్శించారు. పోలీసులు తమ పట్ల దురుసుగా ప్రవర్తించడంతో చీరలు చిరిగాయని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం తాము నినదిస్తే మహిళల చీరలు చించుతారా అని ధ్వజమెత్తారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి తదితరులు మద్దతు పలికారు. రాష్ట్రానికి హోదా కావాలని డిమాండ్ చేసిన మహిళలకు మద్దతుగా నిలవాల్సింది పోయి, చీరలు చించుతారా అని ధ్వజమెత్తారు. మహిళలను పురుష పోలీసులు లాగేయడమే కాకుండా, వారి మెడల్లోని పుస్తెలు తెంచారని ఆరోపించారు.

వెంకయ్య ఇంటి ముట్టడిని అడ్డుకున్న పోలీసులు

ప్రత్యేక హోదా కోరుతూ ఏపీలో నిరసనలు కొనసాగుతున్నాయి. బుధవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఇంటిని ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు.

చంద్రబాబు

చంద్రబాబు

బంద్ సందర్భంగా తమ పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు చిత్తూరు జిల్లా తిరుపతిలో వైసిపి మహిళలు రోడ్డెక్కారు. నిన్న పోలీసులు తమ పట్ల ప్రవర్తించిన వైఖరికి తాము నిరసన తెలుపుతున్నామన్నారు.

ప్రత్యేక హోదా నిరసన

ప్రత్యేక హోదా నిరసన

గత సార్వత్రిక ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైసిపి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి డప్పు వాయిస్తున్న దృశ్యం.

ప్రత్యేక హోదా నిరసన

ప్రత్యేక హోదా నిరసన

గత సార్వత్రిక ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైసిపి ఆధ్వర్యంలో తిరుపతిలో నిరసన దృశ్యం.

ప్రత్యేక హోదా నిరసన

ప్రత్యేక హోదా నిరసన

గత సార్వత్రిక ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైసిపి ఆధ్వర్యంలో తిరుపతిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిరసనలో పాల్గొన్న మహిళా నాయకులు.

ప్రత్యేక హోదా నిరసన

ప్రత్యేక హోదా నిరసన

గత సార్వత్రిక ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైసిపి ఆధ్వర్యంలో తిరుపతిలో నిరసన ప్రదర్శనలో పాల్గొన్న భూమన కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party woman leaders protest in Tirupati on wednesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి