వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రేట్ : 32 వేల ఏళ్ల క్రితమే మరణించింది.. అయినా బతికించారు

దాదాపు 32 వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ఓ మొక్కను తిరిగి భూమ్మీద మొలకెత్తేలా చేశారు సైబీరియా శాస్త్రవేత్తలు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

సైబీరియా: మరణించిన వారికి తిరిగి ప్రాణం పోసే పరిశోధనలు ప్రపంచంలో కొన్ని చోట్ల జరుగుతున్నాయి. మన దేశంలో కూడా గత ఏడాది ఓ రాష్ట్ర ప్రభుత్వం ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పిన సంజీవనిని కనుగొనడానికి కొంత మొత్తంలో నిధులను కూడా కేటాయించింది.

చాలా ఏళ్ల క్రితం మరణించి ఇంకా మిగిలి ఉన్న జీవుల డీఎన్ఏ కణాలతో ప్రాణం ఉన్న జన్యువులను కలిపి తిరిగి వాటిని సృష్టించే ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిశోధనలే నిర్వహిస్తున్న రష్యా ఈ దిశగా ఒకడుగు ముందుకేసింది.

దాదాపు 32 వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ఓ మొక్కను తిరిగి భూమ్మీద మొలకెత్తేలా చేశారు సైబీరియా శాస్త్రవేత్తలు. ఈ మొక్క పేరు సైలిన్ స్టెలోఫిల్లా. సైబీరియాలోని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెల్ బయోఫిజిక్స్ కు చెందిన శాస్త్రవేత్తలు ఈ ఘనతను సాధించారు.

32,000 Year Old Plant Brought Back to Life

తమ పరిశోధనల్లో భాగంగా కోలైమా నది పరివాహక ప్రాంతంలో చనిపోయిన జీవుల జన్యువుల కోసం అన్వేషిస్తున్న సమయంలో నదికి దగ్గరలోని ఓ ప్రాంతంలో మంచు దిబ్బల కింద ఓ ఉడుత తన ఆహారం కోసం దాచుకున్న చిన్న గింజ ఓ పరిశోధకుడికి కనిపించింది.

ఆ గింజతో టెస్ట్ ల్యాబ్ కు చేరుకున్న పరీక్షించగా.. అది 32 వేల సంవత్సరాల క్రితం భూమ్మీద జీవించిన సైలిస్ స్టెలోఫిల్లా అనే గడ్డి మొక్కకు చెందిన గింజ అని తెలిసింది. సైలిన్ స్టెలోఫిల్లా ప్రస్తుత ప్రపంచంలో కూడా ఉంది.

అయితే కాలాంతరంలో దాని జన్యువుల్లో భారీ మార్పులు జరిగాయి. దీంతో ఆ గింజను మొలకెత్తించి వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన ఆ మొక్కను తిరిగి మొలిపించాలని నిర్ణయించుకున్న పరిశోధకులు.. అందులో సఫలమయ్యారు.

రష్యా శాస్త్రవేత్తలు సాధించిన ఈ విజయం మరణించిన జంతువుల జన్యువులను ప్రాణం ఉన్న డీఎన్ఏ జన్యువులతో కలిపి అంతరించిపోయిన జంతువులను తిరిగి భూమ్మీద సృష్టించే అవకాశాలను, ఆశలను చిగురింపజేస్తోంది. ఏమో ఎవరు చెప్పగలరు? అంతరించిపోయిన రాక్షస బల్లులు, గండభేరుండ పక్షులను తిరిగి మనం భూమ్మీద చూస్తామేమో?

English summary
The oldest plant ever to be regenerated has been grown from 32,000-year-old seeds—beating the previous recordholder by some 30,000 years. (Related: "'Methuselah' Tree Grew From 2,000-Year-Old Seed.") A Russian team discovered a seed cache of Silene stenophylla, a flowering plant native to Siberia, that had been buried by an Ice Age squirrel near the banks of the Kolyma River (map). Radiocarbon dating confirmed that the seeds were 32,000 years old.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X