వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోత్కుపల్లికి మొండిచేయి చూపిస్తారా: మరోసారి మోడీ వద్దకు చంద్రబాబు

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవిపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంతో మరోసారి మాట్లాడే అవకాశముందని టిడిపి నేతలు భావిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవిపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంతో మరోసారి మాట్లాడే అవకాశముందని టిడిపి నేతలు భావిస్తున్నారు.

చెప్పారు కానీ.. బాబుకు మోడీ షాక్: మోత్కుపల్లికి గవర్నర్ ఛాన్స్ లేనట్లే? చెప్పారు కానీ.. బాబుకు మోడీ షాక్: మోత్కుపల్లికి గవర్నర్ ఛాన్స్ లేనట్లే?

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన గవర్నర్‌ నియమకాల్లో మోత్కుపల్లి పేరు లేకపోవడం టిడిపి పార్టీ వర్గాలను నిరాశకు గురి చేసిన విషయం తెలిసిందే. మోత్కుపల్లికి మొండి చేయి చూపిస్తారా? అంటూ నేతలు అనుమానం వ్యక్తం చేశారు.

 మోత్కుపల్లి పేరును సూచించిన బాబు

మోత్కుపల్లి పేరును సూచించిన బాబు

కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, గవర్నర్‌ కోటా కింద తమ పార్టీ నుంచి మోత్కుపల్లి పేరును టిడిపి సూచించింది. ఈ ప్రతిపాదనకు బిజెపి పెద్దలు సుముఖత వ్యక్తం చేశారు. కానీ మూడేళ్లు గడిచినా ఇంత వరకు ఆ నియామకం జరగలేదు.

Recommended Video

Amit Shah Promises: TDP Leader Motkupalli Narasimhulu to Get Governor Post - Oneindia Telugu
 మోత్కుపల్లికి వెంకయ్య శుభవార్త

మోత్కుపల్లికి వెంకయ్య శుభవార్త

ఇటీవల వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ఎంపికైన తర్వాత, తెలంగాణ టిడిపి నేతలు ఆయనను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. మోత్కుపల్లి త్వరలో శుభవార్త వింటారని చెప్పారు. దీంతో మోత్కుపల్లికి గవర్నర్‌ సీటు ఖాయమన్న అభిప్రాయం ఏర్పడింది.

 మోత్కుపల్లికి రాని అవకాశం

మోత్కుపల్లికి రాని అవకాశం

అయితే, నాలుగు రోజుల క్రితం కేంద్రం ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను ఖరారు చేసింది. కానీ అందులో మోత్కుపల్లికి అవకాశం రాలేదు. ఈ పరిణామం టిడిపిలో చర్చకు దారి తీసింది. మూడేళ్లు గడిచినా బిజెపి అధినాయకత్వం ఇంకా ఊరిస్తూనే ఉందని టిడిపి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 బీజేపీ అధిష్టానం వద్దకు చంద్రబాబు మరోసారి

బీజేపీ అధిష్టానం వద్దకు చంద్రబాబు మరోసారి

పార్టీలోని సీనియర్‌ దళిత నేతకు హామీ ఇచ్చి, సుదీర్ఘకాలం కేంద్ర దానిని పెండింగ్‌లో ఉంచడం సరైన సంకేతాలు ఇవ్వవని అంటున్నారు. మరోవైపు, ఆ పరిణామంపై చంద్రబాబు ఇంతవరకు పెదవి విప్పలేదు. మరోసారి కేంద్రం దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లి, మోత్కుపల్లికి పోస్ట్ సాధించాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

English summary
Telugu Desam president and Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu is said to be deeply dissatisfied with the omission of senior party functionary Motkupalli Narasimhulu from the gubernatorial appointments that were announced on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X