ప్రభుత్వాన్ని విమర్శిస్తే.. ఇక 'నో ఇంక్రిమెంట్స్': ప్రభుత్వ ఉద్యోగులకు ఝలక్!

వీటితో పాటు కొత్త సర్క్యులర్ లో మరికొన్ని నిబంధనలు జోడించారు. ఆలస్యంగా ఆఫీసుకు రావడం, సీనియర్ల మాటను పెడచెవిన పెట్టడం, లైంగిక వేధింపులకు పాల్పడటం,

బెంగళూరు: ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియామవళికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఇకనుంచి ప్రభుత్వ విధివిధానాలను విమర్శించే ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఉండబోవు. ఈ నిబంధన కింద బుక్కయ్యే ఉద్యోగులకు రెండేళ్ల పాటు ఇంక్రిమెంట్లు నిలిపివేయనున్నారు.

అలాగే ఇకనుంచి కట్నం ఇచ్చే.. మరియు తీసుకునే ఉద్యోగులకు కూడా ఇంక్రిమెంట్లు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో మునుపెన్నడూ ఇలాంటి నిబంధనలు లేవు. కర్ణాటకలో సిద్దరామయ్య సర్కార్ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

Criticize government, you could lose your pay hike

వీటితో పాటు కొత్త సర్క్యులర్ లో మరికొన్ని నిబంధనలు జోడించారు. ఆలస్యంగా ఆఫీసుకు రావడం, సీనియర్ల మాటను పెడచెవిన పెట్టడం, లైంగిక వేధింపులకు పాల్పడటం, నిధుల దుర్వినియోగానికి పాల్పడటం వంటివి చేస్తే రెండేళ్ల పాటు ఇంక్రిమెంట్ ఉండదు.

కర్ణాటక సర్కార్ కొత్త నిబంధనల జాబితా:

  • ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడితే-బలవంతపు రిటైర్ట్ మెంట్ తప్పదు.
  • రూ.10వేల వరకు నిధుల దుర్వినియోగానికి పాల్పడితే- ఐదేళ్ల పాటు సాలరీ ఇంక్రిమెంట్ ఉండదు.
  • రూ.10వేల కన్నా ఎక్కువ నిధులను దుర్వినియోగం చేస్తే- డిమోషన్
  • లైంగిక వేధింపులకు పాల్పడితే-డిమోషన్ మరియు వేతనం తగ్గింపు
  • సీనియర్లను ధిక్కరిస్తే- రెండేళ్ల పాటు నో ప్రమోషన్
  • ప్రభుత్వాన్ని విమర్శిస్తే-రెండేళ్ల పాటు నో ఇంక్రిమెంట్
  • ఎన్నికల్లో పోటీ చేసినా.. ప్రచారం చేసినా- వేతనం పెంపు నిలిపివేతతో పాటు రెండేళ్ల పాటు ప్రమోషన్ నిలిపివేత
  • వ్యాపారాలు చేసినా.. మరో జాబ్ లో కొనసాగుతున్నా-డిమోషన్ మరియు వేతన తగ్గింపు తప్పదు.
  • భార్య ఉండగా మరో పెళ్లి చేసుకుంటే-బలవంతపు రిటైర్ట్ మెంట్
  • ఆఫీసుకు ఎప్పుడూ ఆలస్యంగా వచ్చేవారికి-నో ప్రమోషన్
  • సినిమాలు, థియేటర్ కార్యక్రమాల్లో పాల్గొనేవారికి.. రెండేళ్ల పాటు ఇంక్రిమెంట్ల నిలిపివేత
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+