ఏపీ ఎఫెక్ట్: బళ్లారిని వదిలి.. అక్కడ చక్రం తిప్పే యోచనలో గాలి

Posted By:
Subscribe to Oneindia Telugu

బళ్లారి: ఒకప్పుడు కర్నాటక రాజకీయాల్లో చక్రం తిప్పిన మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి మరోసారి ఆ ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు. అయితే బళ్లారిలో రాజకీయాలకు స్వస్తి పలికి చిక్‌బళ్లాపూర్ నుంచి ఆరంభించాలని చూస్తున్నారంటున్నారు.

ప్రత్యక్ష రాజకీయాలు: తేల్చి చెప్పిన గాలి జనార్దన్ రెడ్డి: బళ్లారీకి దూరం అందుకేనా!

ఇందుకోసం గాలి జనార్ధన్ ఇప్పటికే కార్యాచరణ జరిపినట్లు తెలుస్తోంది. ఏపీకి సరిహద్దున ఉండడంతోపాటు రెడ్డి కులస్తులు అత్యధికంగా ఉన్నందున చిక్కబళ్ళాపురం జిల్లా వైపు దృష్టి సారించారని అంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో అయిదుగురు ఎమ్మెల్యేలు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారు.

రెడ్లపై కన్నేసిన గాలి

రెడ్లపై కన్నేసిన గాలి

గౌరిబిదనూరు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న శివశంకర రెడ్డి శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరిస్తుండగా చిక్కబళ్ళాపుర ఎమ్మెల్యే సుధాకర్‌ దాదాపు మంత్రి చేతిదాకా వచ్చి చేజారింది. బాగేపల్లిలో స్వతంత్రంగా నిలిచిన సుబ్బారెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ కంచుకోటను తనవైపు తిప్పుకోవాలని..

కాంగ్రెస్ కంచుకోటను తనవైపు తిప్పుకోవాలని..

జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న తనవైపు తిప్పుకోవాలనే ఎత్తుగడలో గాలి జనార్ధన్ ఉన్నట్లు చెబుతున్నారు. జిల్లా నుంచి ఏకంగా రెండు లేదా మూడు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని చూస్తున్నారంటున్నారు.

భార్యను, సాయికుమార్‌ను రంగంలోకి..

భార్యను, సాయికుమార్‌ను రంగంలోకి..

గౌరిబిదనూరు నుంచి భార్యను, బాగేపల్లి నుంచి ఆప్తుడు, దక్షిణాది భాషలలో ప్రముఖ నటుడిగా ఉన్న సాయికుమార్‌ను పోటీ చేయించాలనే ఆలోచనలో గాలి జనార్ధన్ ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే ఓసారి సాయికుమార్‌ బాగేపల్లినుంచి పోటీ చేసి ఓటమి చెందారు. రానున్న ఎన్నికలలో ఆయన పోటీ చేయాలనే ఆలోచనలో ఇప్పటికే ఉన్నారు. ఇక ఏదో ఒక నియోజకవర్గంలో గాలి కూడా పోటీ చేయనున్నారు.

శ్రీరాములును రంగంలోకి దింపి..

శ్రీరాములును రంగంలోకి దింపి..

ఈ నియోజకవర్గంలో రెడ్డి, వాల్మీకి సామాజికవర్గం ఓట్లపై కన్నేశారని చెబుతున్నారు. రెడ్డి సామాజిక వర్గాన్ని నేరుగా గాలి ప్రసన్నం చేసుకోవాలని, ఇక వాల్మీకి కులస్తుల కోసం శ్రీరాములను ప్రచారానికి దించాలనే ఆలోచనలో గాలి జనార్ధన్ ఉన్నారని తెలుస్తోంది.

కాంగ్రెస్‌కు షాకిస్తారా

కాంగ్రెస్‌కు షాకిస్తారా

మూడు నియోజకవర్గాలలో గాలి ప్రభావం చూపాలనుకుంటున్నారట. గతంలో బళ్ళారిలోనూ నాలుగైదు నియోజకవర్గాలలో అనుచరులను గెలిపించుకోవడంలో సఫలమైన గాలి.. ఇప్పుడు అదే ఎత్తుగడను చిక్కబళ్ళాపుర్ పైన ప్రయోగించనున్నారని అంటున్నారు. కాంగ్రెస్‌కు పట్టు ఉన్న ఈ జిల్లాలో గాలి చక్రం ఫలిస్తుందా చూడాలి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Gali Janardhan Reddy now seeing at at Chikballapur district.
Please Wait while comments are loading...